AP SI Call Letters : ఏపీ ఎస్సై, ఆర్ఎస్సై ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap si rsi physical events call letters released download call letter pmt pet schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Si Call Letters : ఏపీ ఎస్సై, ఆర్ఎస్సై ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP SI Call Letters : ఏపీ ఎస్సై, ఆర్ఎస్సై ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Bandaru Satyaprasad HT Telugu
Aug 14, 2023 06:21 PM IST

AP SI Call Letters : ఏపీ ఎస్సై, ఆర్ఎస్సై ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు విడుదల అయ్యాయి. ఈ నెల 25 నుంచి విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి.

ఎస్సై కాల్ లెటర్స్
ఎస్సై కాల్ లెటర్స్

AP SI Call Letters : ఎస్సై, ఆర్ఎస్సై ఉద్యోగాల రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. దేహదారుఢ్య పరీక్షల(PMT, PET) లెటర్లను పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ లైట్ https://slprb.ap.gov.in/లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 24వ తేదీ వరకు కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని నియామక బోర్డు తెలిపింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులోని కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు స్టేజ్‌-2 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీని వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 411 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఫిజికల్ ఈవెంట్స్ కు 56,116 మంది ఎంపికయ్యారు.

కాల్ లెటర్ ఇలా డౌన్ లోడ్ చేసుకుండి

  • Step 1 : అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in ని సందర్శించాలి.
  • Step 2 : మీరు APSLPRB అధికారిక వెబ్‌సైట్‌కి చేరుకున్న తర్వాత, హోమ్‌పేజీలో “రిక్రూట్‌మెంట్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • Step 3 : ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మరో వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత, రిక్రూట్‌మెంట్‌ల జాబితా నుంచి AP SI రిక్రూట్‌మెంట్ 2023ని ఎంచుకోండి.
  • Step 4 : AP SI ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 5 : మీ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెం, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • Step 6 : సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ కాల్ లెటర్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసి, ప్రింట్‌అవుట్ తీసుకోండి.

ఏపీలో ఎస్ఐ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారయ్యాయి. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 28 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఫిజికల్ ఈవెంట్స్ ను విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబర్ 28వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 14వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఎస్సై పోస్టులు(SI Posts) మహిళలు, పురుషులకు(సివిల్) 315 ఉద్యోగాలు ఉండగా.. రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు (APSP) 96 పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించి 'స్టేజ్-2' ఆన్‌లైన్‌ అప్లికేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరైన సమయంలో అధికారులకు సమర్పించాలి. పదోతరగతి సర్టిఫికెట్‌, విద్యార్హత, కమ్యూనిటీ, స్థానికత, ఇతర అర్హత ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. తాజాగా ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన తేదీలు ప్రకటించారు అధికారులు.

Whats_app_banner