తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Population: అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా.. వచ్చే ఏడాదే ఈ రికార్డు: యూఎన్

India Population: అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా.. వచ్చే ఏడాదే ఈ రికార్డు: యూఎన్

HT Telugu Desk HT Telugu

11 July 2022, 12:49 IST

google News
    • India Population: వచ్చే ఏడాది భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమిస్తుందని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక అంచనా వేసింది.
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లోని లిఫ్ఫీ నది ఒడ్డున ఐరిష్ శిల్పి రోవాన్ గిల్లెస్పీ చెక్కిన కరువు స్మారక విగ్రహాలు. మహా క్షామం (1845-1849) జ్ఞాపకార్థం ఈ శిల్పాలు చెక్కారు. ఈ సమయంలో మరణాలు, వలసల ద్వారా ఐర్లాండ్ జనాభా సగానికి తగ్గింది. (ఫోటో డేవిడ్ గానన్ / AFP)
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లోని లిఫ్ఫీ నది ఒడ్డున ఐరిష్ శిల్పి రోవాన్ గిల్లెస్పీ చెక్కిన కరువు స్మారక విగ్రహాలు. మహా క్షామం (1845-1849) జ్ఞాపకార్థం ఈ శిల్పాలు చెక్కారు. ఈ సమయంలో మరణాలు, వలసల ద్వారా ఐర్లాండ్ జనాభా సగానికి తగ్గింది. (ఫోటో డేవిడ్ గానన్ / AFP) (AFP)

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లోని లిఫ్ఫీ నది ఒడ్డున ఐరిష్ శిల్పి రోవాన్ గిల్లెస్పీ చెక్కిన కరువు స్మారక విగ్రహాలు. మహా క్షామం (1845-1849) జ్ఞాపకార్థం ఈ శిల్పాలు చెక్కారు. ఈ సమయంలో మరణాలు, వలసల ద్వారా ఐర్లాండ్ జనాభా సగానికి తగ్గింది. (ఫోటో డేవిడ్ గానన్ / AFP)

India Population: యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ద్వారా వెలువడిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక అంచనాల ప్రకారం నవంబర్ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుంది.

కాగా ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.4 బిలియన్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

తూర్పు, ఆగ్నేయ ఆసియా జనాభా 2030ల మధ్య నాటికి క్షీణించడం ప్రారంభించవచ్చని, కాబట్టి 2037 నాటికి మధ్య, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా అవతరించగలదని భావిస్తున్నారు.

రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఏషియాలోనే ఉన్నాయి. చైనా, భారతదేశం ఒక్కొక్కటి 1.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.

చైనా జనాభా 1.426 బిలియన్లతో పోలిస్తే 2022లో భారతదేశ జనాభా 1.412 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 2050లో భారతదేశం 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అప్పటికి చైనాలో 1.317 బిలియన్ల జనాభా ఉంటుంది.

1965 తర్వాత ప్రపంచ జనాభా పెరుగుదల సగానికిపైగా మందగించిందని, సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది.

భారతదేశంలో 2100లో సంతానోత్పత్తి రేటు 1.29గా ఉంటుందని అంచనా వేసింది. దీని ఫలితంగా శతాబ్దం చివరిలో ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం జనాభా 433 మిలియన్లు తక్కువగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2022లో మహిళల (49.7 శాతం) కంటే పురుషుల (50.3 శాతం) సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య శతాబ్ద కాలంలో రివర్స్ అవుతుందని అంచనా. 2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.

1950 తర్వాత మొదటిసారిగా 2020లో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక ప్రపంచ జనాభాపై వలసల ప్రభావం కూడా ఉంది.

తదుపరి వ్యాసం