తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclones In India : ఒకేసారి రెండు తుపానులు.. అటు అరేబియాలో, ఇటు బంగాళాఖాతంలో!

Cyclones in India : ఒకేసారి రెండు తుపానులు.. అటు అరేబియాలో, ఇటు బంగాళాఖాతంలో!

Sharath Chitturi HT Telugu

22 October 2023, 11:05 IST

google News
    • Cyclones in India : అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను తీవ్రరూపం దాల్చనుంది. మరోవైపు బంగాళాఖాతంలో కొత్త తుపాను ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి
ఒకేసారి రెండు తుపానులు.. అటు అరేబియాలో, ఇటు బంగాళాఖాతంలో!
ఒకేసారి రెండు తుపానులు.. అటు అరేబియాలో, ఇటు బంగాళాఖాతంలో! (HT_PRINT)

ఒకేసారి రెండు తుపానులు.. అటు అరేబియాలో, ఇటు బంగాళాఖాతంలో!

Cyclone Tej latest updates : ఒక తుపాను వస్తోందంటేనే తీర ప్రాంత ప్రజలు భయపడిపోతుంటారు. అలాంటిది.. ఇండియా మీదకు ఒకేసారి రెండు తుపానులు మంచుకొచ్చే ప్రమాదం ఉందన్న వార్త వింటే! త్వరలో ఇదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు అరేబియా సముద్రంలో, ఇటు బంగాళాఖాతంలో రెండు వేరువేరు తుపానులు దూసుకొచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

తేజ్​- హమూన్​ తుపానులు!

అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను ఇప్పటికే ఆందోళనకరంగా మారింది. రానున్న కొన్ని గంటల్లో ఈ సైక్లోన్​ మరింత తీవ్రరూపం దాల్చుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. అది తీవ్రరూపం దాల్చి తుపానుగా మారితే.. దానిని 'హమూన్​' తుపాను అని పేరు పెడతామని ఐఎండీ స్పష్టం చేసింది.

Cyclone in Bay of Bengal : "నైరుతి అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి ఇది తీవ్రరూపం దాల్చుతుంది. అక్కడి నుంచి ఒమన్​వైపు ఈ తుపాను ప్రయాణించే అవకాశం ఉంది," అని ఐఎండీ వెల్లడించింది.

"నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం నాటికి మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తుపానుగా మారలేదు," అని ఐఎండీ తెలిపింది.

Cyclone Tej live tracking : ఇండియాలో ఇలా ఒకేసారి రెండు వేరువేరు తుపానులు ఆవిర్భవించడం చాలా అరుదు. చివరిగా.. 2018లో ఇలా జరిగింది.

గుడ్​ న్యూస్​..!

అయితే ఈ తేజ్​ తుపాను, హమూన్​ తుపానుల కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఐఎండీ చెబుతోంది. ఇండియాపై వీటి ప్రభావం తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. చెన్నైతో పాటు తమిళనాడు తీర ప్రాంతాలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాకపోతే కేరళ, మధ్య తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. అధికారులు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిస్తోంది.

Cyclones in India : ఈ గండం దాటితే.. ఈ ఏడాది ఇక ఇలాంటివి ఇండియాను ఇబ్బంది పెట్టవని ప్రైవేట్​ వాతావరణశాఖ స్కైమేట్​ అభిప్రాయపడింది.

ఇక రుతుపవనాల విషయానికొస్తే.. అక్టోబర్​ మొదటి వారంలో అవి భారత్​ను పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఈ ఏడాది జూన్​లో అవి కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కాగా.. ఈసారి కొన్ని నెలల్లో ఎక్కువ వర్షాలు పడగా.. ఇంకొన్ని నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్​నీనో ఎఫెక్ట్​ ఇందుకు కారణం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం