IIT placements down : ఐఐటీల్లో ఐటీ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్- జాబ్ ఆఫర్స్ 30శాతం డౌన్!
10 December 2023, 12:45 IST
IIT placements down 2023 : ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. ఐఐటీల్లో ఉద్యోగాలు 30శాతం తగ్గిపోయాయి! కంప్యూటర్ సైన్స్, ఐటీ ఉద్యోగులకు కూడా జాబ్ ఆఫర్స్ రావడం లేదని తెలుస్తోంది.
ఐఐటీల్లో జాబ్ ఆఫర్స్ 30శాతం డౌన్!
IIT placements down 2023 : దేశంలోని ఐఐటీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది! గత అకాడమిక్ సెషన్‌తో పోల్చుకుంటే.. ఈసారి, ఇప్పటివరకు 30శాతం తక్కువగా జాబ్ ఆఫర్స్ రావడం ఇందుకు కారణమని ఓ నివేదిక పేర్కొంది.
సీఎస్ఈ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్..!
సాధారణంగా.. ప్లేస్‌మెంట్స్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంటుంది. నివేదిక ప్రకారం.. ఈసారి.. వారికి కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ప్లేస్మెంట్ డ్రైవ్ మొదలైన తర్వాత.. వారం, అంతకన్నా ఎక్కువ రోజులపాటు ఒక్క సీఎస్ఈ విద్యార్థికి కూడా ఉద్యోగం రాకపోవడం ఇదే తొలిసారి!
ఇండియాలో ప్లేస్‌మెంట్స్ విషయాల్లో ఐఐటీలు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేస్తాయి. వీటిల్లో చదువుకునే విద్యార్థులు.. భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు కొడతారు. అలాంటిది.. ఈసారి పరిస్థితి ఈ విధంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం.
IIT Students placements : గతేడాది కూడా ఐఐటీ దిల్లీ, బాంబే, కాన్పూర్, మద్రాస్, రూర్ఖీ, గౌహతి, వారణాసి (బీహెచ్‌యూ), ఖరగ్పూర్ల్లో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ బాగానే జరిగిది. వేలాది మంది విద్యార్థులు పోటీపడి.. ఉద్యోగాలు సంపాదించుకున్నారు. టెక్ ప్రపంచం నెమ్మదించినా.. ఐటీ విద్యార్థులకు మాత్రం మంచి ఉద్యోగాలే వచ్చాయి.
కానీ ఈసారి.. వీరందరికి కష్టకాలం ఎదురవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. టెక్ ప్రపంచం నెమ్మదించిన ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోందని తెలుస్తోంది. చాలా సంస్థలు ఈసారి ప్లేస్‌మెంట్స్‌కి దూరంగా ఉంటున్నాయట.
IIT latest news : "గతేడాది వరకు.. 10 మంది విద్యార్థులను ఎంచుకునే రిక్రూటర్స్.. ఇప్పుడు 1-2 ఇద్దరికే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నారు. కొన్ని సంస్థలైతే.. విద్యార్థులను తీసుకోకుండానే వెళ్లిపోతున్నాయి," అని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకుంటున్న విద్యార్థి చెప్పాడు.
ఐఐటీ ఖరగ్‌పూర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రకారం.. 2023 డిసెంబర్ 1న ఫైనల్ ప్లేస్మెంట్ డ్రైవ్ మొదలైంది. కాగా.. 7వ రోజు నాటికి ఈ వర్సిటీలో 1,181 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. గతేడాది జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో.. ఐదో రోజుకే 1,300కుపైగా ఆఫర్స్ లభించడం గమనార్హం.
IIT placements latest news : మరోవైపు ఐఐటీ- బీహెచ్‌యూలో శుక్రవారం ఉదయం నాటికి 850 జాబ్ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. గతేడాది తొలి నాలుగు రోజుల్లోనే 1000కుపైగా జాబ్ ఆఫర్స్ లభించాయి.
మరి రానున్న రోజుల్లో.. ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ పుంజుకుంటాయో లేదో చూడాలి!