IIT Madras : ‘జాబ్ ఆఫర్ల’లో ఐఐటీ మద్రాస్ రికార్డు.. అత్యధిక ప్యాకేజీ రూ. 1.98 కోట్లు!
08 August 2022, 16:43 IST
- IIT Madras placements 2022 : ఐఐటీ మద్రాస్ రికార్డు సృష్టించింది. ఈసారి.. 1,199 మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు వచ్చాయి.
‘జాబ్ ఆఫర్ల’లో ఐఐటీ మద్రాస్ రికార్డు.. అత్యధిక ప్యాకేజీ రూ. 1.98 కోట్లు!
IIT Madras placements 2022 : జాబ్ ఆఫర్లలో ఐఐటీ మద్రాస్ రికార్డు సృష్టించింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు దశల్లో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగ్గా.. 380 కంపెనీలు వచ్చి.. 1,199 ఉద్యోగాలను విద్యార్థులకు ఆఫర్ చేశాయి. వీటితో పాటు 231 మంది.. ప్రీ-ప్లేస్మెంట్ డ్రైవ్(పీపీఓ)లోనే ఉద్యోగాలు సంపాదించారు. ఫలితంగా.. ఈసారి మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,430కు చేరింది. 2018-19 విద్యా సంవత్సరంలో వచ్చిన జాబ్ ఆఫర్ల(1,151) కన్నా ఇది ఎక్కువే.
ఈసారి వచ్చిన జాబ్ ఆఫర్లలో 45 ఉద్యోగాలు విదేశాల్లో ఉన్నాయి. ఈ 45 ఉద్యోగాలను 14 కంపెనీలు ఆఫర్ చేశాయి. ఇది కూడా ఒక రికార్డే. అదే సమయంలో 199మంది విద్యార్థులకు 131 స్టార్టఅప్ కంపెనీలు జాబ్ ఆఫర్ చేశాయి. ఎంబీఏకు చెందిన మొత్తం 61మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారు. ఫలితంగా ఆ విభాగంలో ఐఐటీ మద్రాస్.. 100శాతం ప్లేస్మెంట్ ఘనతను సాధించింది.
IIT Madras : 2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థులు అందుకున్న సగటు వేతనం.. ఏడాదికి రూ. 21.48లక్షలు. ఓ విద్యార్థికి అత్యధికంగా రూ. 1.98కోట్ల(2,50,000 డాలర్లు) ప్యాకేజీ లభించింది.
ఉద్యోగాల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్లో రిజిస్టర్ చేసుకున్న 80శాతం మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు వచ్చాయి.
రకుటెన్ మొబైల్, గ్లీన్, మైక్రాన్ టెక్నాలజీస్, హోండా ఆర్ ఎండీ, కొహెస్టీ, డా విన్సి డెరివేటివ్స్, యాక్సెంచర్ జపాన్, హిలాబ్స్ ఇంక్, క్వాంట్బాక్స్ రీసెర్చ్, మీడియా టెక్, మనీ ఫార్వర్డ్, రుబ్రిక్, ఉబెర్ వంటి అంతర్జాతీయ సంస్థలు.. ఈసారి విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చాయి.
టాపిక్