తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Job Vacancies : కెనడాలో 10 లక్షలకుపైగా ఉద్యోగాలు.. భారతీయులకు సువర్ణావకాశం!

Job Vacancies : కెనడాలో 10 లక్షలకుపైగా ఉద్యోగాలు.. భారతీయులకు సువర్ణావకాశం!

Sharath Chitturi HT Telugu

07 August 2022, 14:55 IST

google News
    • Job Vacancies : కెనడాలో ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు ఇదొక సువర్ణావకాశం!
కెనడాలో 10లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇదొక సువర్ణావకాశం!
కెనడాలో 10లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇదొక సువర్ణావకాశం! (AP)

కెనడాలో 10లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇదొక సువర్ణావకాశం!

Canada Job Vacancies : ఇతర దేశాలకు వెళ్లి, ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడాలి అని అనుకుంటున్న భారతీయులకు సువర్ణావకాశం! కెనడాలో ఇప్పటికే 10లక్షలకుపైగా ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2021 మే(3లక్షలు)తో పోల్చుకుంటే.. ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

మే 2022 వరకు దేశంలో ఉన్న పోస్టుల ఖాళీలపై ఓ సర్వే జరిగింది. సర్వే ప్రకారం.. దేశంలో పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంది. పైగా.. దేశంలో నిరుద్యోగుల రేటు కూడా తక్కువగా ఉంది. అక్కడ పనిచేసే వారిలో చాలా మంది రిటైర్మెంట్​ దశకు చేరుకుంటుండటంతో.. విదేశీయులకు డిమాండ్​ పెరుగుతోంది. ఫలితంగా కెనడాలో జాబ్​ వేకెన్సీ రేటు చాలా ఎక్కువగా ఉంది.

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా.. 2022లో పీఆర్​(పర్మనెంట్​ రెసిడెంట్స్​)లను స్వాగతించేందుకు కెనడా సన్నద్ధమవుతోంది. 2022లో 4.3లక్షల పీఆర్​లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి ఆ సంఖ్యను 4.5లక్షలు దాటించాలని భావిస్తోంది.

Jobs in Canada : నిరుద్యోగం రేటు తక్కువగా ఉండటంతో ఇమ్మిగ్రేషన్​ ద్వారా కెనడాకు వెళ్లిన వారికి ఉద్యోగాలు దొరికే అవకాశం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల.. కెనడాలో పీఆర్​ అప్లై చేసుకునేందుకు, ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇదొక సువర్ణావకాశం.

చాలా రాష్ట్రాల్లో ఎన్నడు లేని విధంగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు మరో సర్వే పేర్కొంది.

ఆల్బర్ట, ఒంటారియోలో ఏప్రిల్​ నాటికి.. ఒక్కో ఖాళీకి సగటు 1.1 మంది పోటీపడుతున్నారు. మార్చ్​లో అది 1.2గా ఉండేది. ఇక గతేడాది అది 2.4గా ఉండటం గమనార్హం.

న్యూఫౌండ్​ల్యాండ్​, లబ్రెడోర్​ వంటి ప్రాంతాల్లో.. ఒక్కో పోస్టుకు సగటున నలుగురు పోటీ పడుతున్నారు. భారత దేశంలో.. ఒక్కో పోస్టు కోసం పోటీ పడే వారి సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంటున్న విషయం తెలిసిందే!

ప్రొఫెషనల్స్​, సైంటిఫిక్​, టెక్నికల్​ సర్వీసెస్​, రవాణా, ఫైనాన్స్​, బీమా, రియల్​ ఎస్టేట్​ వంటి రంగాల్లో పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి.

రిటైర్మెంట్​..

Canada jobs for Indians : కెనడాలో పరిస్థితి ఇతర దేశాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. అక్కడ చాలా మంది పని చేయడానికి ఇష్టపడటం లేదు! అదే సమయంలో 55ఏళ్లు పైబడిన వారు.. తొందరగా రిటైర్మెంట్​ తీసుకోవాలని చూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం.. 1946-1964లో జన్మించిన వారిలో.. దాదాపు 90లక్షలకుపైగా మంది ఈ దశాబ్దంలో రిటైర్​ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

కెనడాలో జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది! 2020లో.. సంతానోత్పతి రేటు.. అత్యంత కనిష్ఠానికి చేరింది. ఓ మహిళకు సగటున 1.4మంది పిల్లలు పుడుతున్నారు.

ఈ పరిణామాలతో కెనడాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయులకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి.

తదుపరి వ్యాసం