Teacher Jobs | ఆదర్శ పాఠశాలల్లో 282 ఉద్యోగాలు....
10 November 2022, 14:29 IST
- ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు ప్రతిపాదికన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 282 ఉపాధ్యాయ పోస్టుల్ని కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల్ని కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేస్తారు. 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ టీచర్ పోస్టులతో పాటు 71ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ టీచర్ పోస్టులకు 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు అయా సబ్జెక్టుల్లో బిఇడి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మోడల్ స్కూల్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితి 44ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్ధులకు గరిష్టంగా 49ఏళ్ల వయోపరిమితి ఉంటుంది.
అభ్యర్ధులను జోన్, రిజర్వేషన్ ప్రాతిపాదికన ఎంపిక చేస్తారు. డిగ్రీ, పీజీ కోర్సులకు 60శాతం, బీఈడికి పది శాతం, గతంలో పనిచేసిన వారికి 20శాతం, కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగ్ డెమోకు 10శాతం వెయిటేజీ ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సబ్జెక్టులు, జిల్లాల వారీ ఖాళీల కోసం విద్యాశాఖ వెబ్‌సైట్‌లో సమాచారం అందించారు. ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీగా ఆగష్టు 17వ తేదీని ప్రకటించారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
టాపిక్