Himachal Pradesh elections : 'వీరభద్రుడి'పైనే భారం వేసిన కాంగ్రెస్.. వ్యూహం ఫలించేనా?
28 October 2022, 6:59 IST
Himachal Pradesh assembly elections 2022 : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌కు అత్యావసరం! ఇందుకోసం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. దివంగత నేత, మాజీ సీఎం వీర్‌భద్ర సింగ్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచించింది. మరి కాంగ్రెస్ ప్రయోగించిన ‘వీరభద్రుడి’ అస్త్రం ఫలిస్తుందా?
పార్టీ జెండాతో కాంగ్రెస్ కార్యకర్తలు
Himachal Pradesh assembly elections 2022 : రోజులు గడుస్తున్న కొద్ది.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలుపు సాధించాలన్న కాంక్షతో బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరికి ఆప్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌కు ఈ దఫా ఎన్నికలు ఎంతో కీలకం. దిగ్గజ నేత, మాజీ సీఎం వీర్‌భద్ర సింగ్ లేకుండా ఈసారి ఎన్నికల్లోకి వెళుతోంది కాంగ్రెస్. కానీ ఆయన్ని మాత్రం వదులుకోలేదు! ఆయన సతీమణి ప్రతిభా సింగ్‌కు రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చింది. వీర్‌భద్ర సింగ్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓట్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాలు, గెలుపుపై మాట్లాడారు ప్రతిభా సింగ్. ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రశ్న:- వీర్‌భద్ర సింగ్ లేని లోటు ఎలా ఉంది?
ప్రతిభా సింగ్:- మాకు నేతల కొరత లేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల కోసం అందరిని దింపుతాము. వీర్‌భద్ర సింగ్ లేకుండానే ఈసారి ఎన్నికల్లోకి వెళుతున్నాము. అందరిని కలుపుకుని ఆయన ముందుకెళ్లేవారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తాము. ప్రచారాల్లో వీర్‌భద్ర ఏదో ఒక రూపంలో ఉండాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన సేవలను ప్రజలు మర్చిపోలేదు. ఈసారి కచ్చితంగా గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము.
ప్రశ్న:- బీజేపీ ప్రచారాలపై మీ స్పందన?
Himachal Pradesh Congress : ప్రతిభా సింగ్:- వీర్‌భద్ర సింగ్ చేసిన అభివృద్ధిని బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రాన్ని ఎవరు, ఎలా అభివృద్ధి చేశారన్నది ప్రజలకు గుర్తుంది. మన్మోహన్ సింగ్ హయాంలో రాష్ట్రానికి 4 వైద్య కళాశాలలు వచ్చాయి. మండీకి ఐఐటీ వచ్చింది. ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి. కానీ గత ఐదేళ్లల్లో సీఎం జైరాం ఠాకూర్ ఏం చేయలేదు. వీర్‌భద్ర సింగ్ ప్రారంభించిన ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు అంతే! అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు.
ప్రశ్న:- టికెట్ల విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయా?
ప్రతిభా సింగ్:- పక్కా సర్వేలు నిర్వహించిన తర్వాతే టికెట్ల పంపిణీ జరుగుతోంది. కచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఇస్తున్నారు. టికెట్ల విషయంలో ఎవరు గొడవ పడటం లేదు. అసంతృప్తితో ఎవరైనా ఉంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారికి అవకాశాలు ఇస్తాము.
ప్రశ్న:- సీఎం పదవి రేసులో మీరు ఉన్నారా?
Himachal Pradesh polls 2022 : ప్రతిభా సింగ్:- ఇది అసలు ప్రశ్నే కాదు. నేను సీఎం రేసులో లేను. అత్యధిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. ఆ తర్వాత ఎవరు సీఎం అవుతారు అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుంది.
ప్రశ్న:- ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ప్రభావం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
ప్రతిభా సింగ్:- రాష్ట్రంలో ఆప్ అంత ప్రభావం చూపించదు. బీజేపీ, కాంగ్రెస్‌లో స్థానం సాధించలేకపోయిన చిన్న చిన్న నేతలు వెళ్లి ఆప్‌లో చేరారు. ఆప్‌ను ప్రజలు కోరుకోవడం లేదు.
ప్రశ్న:- ఎన్నికల ముందు లేదా ఆ తర్వాత.. మీరు బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. మీ స్పందన?
ప్రతిభా సింగ్:- బీజేపీలో చేరడాన్ని నేను కలలో కూడా ఊహించుకోలేను. అలా అస్సలు జరగదు. వీర్‌భద్ర సింగ్ 60ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు సేవ చేశారు. నేనూ అదే చేస్తాను. నేను పార్టీ మారను.
ప్రశ్న:- కాంగ్రెస్ టికెట్ల విషయంలో మీ తనయుడు సంతృప్తిగా ఉన్నారా?
Himachal Pradesh elections : ప్రతిభా సింగ్:- కాంగ్రెస్ అధిష్ఠానంపై విక్రమాదిత్య సింగ్ సంతృప్తిగా ఉన్నారు. యువత, సీనియర్ల కలియికలో టికెట్లు ఇస్తున్నారని సంతోషిస్తున్నారు. వీర్‌భద్ర చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విక్రమాదిత్య కృషిచేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను చేసిన పనులపై ఓ రిపోర్ట కార్డు తయారు చేసుకున్నారు. తనని తాను నిత్యం మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు..
68 సీట్ల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే 46మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. వీర్‌భద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య.. ఈసారి శిమ్లా రూరల్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. కాగా.. 19మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి స్థానాల్లోనే మరోమారు బరిలో దింపుతోంది కాంగ్రెస్.
Himachal Pradesh ele హిమాచల్ ప్రదేశ్‌లో అధికార మార్పిడి ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన బీజేపీ తర్వాత.. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి! మరి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందా? లేకా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? కాంగ్రెస్ ప్రయోగిస్తున్న 'వీర్‌భద్ర సింగ్' అస్త్రం ఫలిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. డిసెంబర్ 8 వరకు వేచి చూడాల్సింది!