తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Priyanka Gandhi In Himachal Election Campaign: హిమాచల్ ప్రచారంలో ప్రియాంక గాంధీ

Priyanka Gandhi in Himachal election campaign: హిమాచల్ ప్రచారంలో ప్రియాంక గాంధీ

HT Telugu Desk HT Telugu

20 October 2022, 18:05 IST

  • Priyanka Gandhi in Himachal election campaign: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కీలక నేతల్లో ఒకరైన ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

     

ప్రియాంక గాంధీ వాద్రా (ఫైల్ ఫొటో)
ప్రియాంక గాంధీ వాద్రా (ఫైల్ ఫొటో)

ప్రియాంక గాంధీ వాద్రా (ఫైల్ ఫొటో)

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ లీడర్ ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ఇప్పటికే ఆమె హిమాచల్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

Priyanka Gandhi in Himachal election campaign: ర్యాలీలు.. రోడ్ షోలు..

హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ మొత్తం 8 బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. అక్టోబర్ 31న, మండి, కుల్లు జిల్లాల్లో, నవంబర్ 3న కాంగ్రా, చంబాల్లో, నవంబర్ 7న హమీర్ పూర్, ఉనాల్లో జరిగే సభల్లో ప్రియాంక పాల్గొంటారు. అలాగే, నవంబర్ 10న సిమ్లా, సిర్మూర్ ల్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాలుపంచుకుంటారు.

Priyanka Gandhi in Himachal election campaign: పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీ

అక్టోబర్ 14వ తేదీననే హిమాచల్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక ప్రారంభించారు. ఆ రోజు సిమ్లాల జరిగిన పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీ ని ఆమె ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే గత పెన్షన్ స్కీమ్ ను మళ్లీ అమల్లోకి తీసుకువస్తామని, సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Priyanka Gandhi in Himachal election campaign: శ్రేణుల్లో ఉత్సాహం..

ప్రియాంక ప్రచారంలో పాల్గొననుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో పార్టీకి పెద్ద దిక్కు అయిన మాజీ సీఎం వీరభద్ర సింగ్ చనిపోవడం కాంగ్రెస్ కు పెద్ద నష్టమే. గత ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లను గెలుచుకున్నాయి.

తదుపరి వ్యాసం