తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sc Collegium : జడ్జీల నియామకాలపై 'సుప్రీం' సిఫార్సులను తిరస్కరించిన కేంద్రం..

SC Collegium : జడ్జీల నియామకాలపై 'సుప్రీం' సిఫార్సులను తిరస్కరించిన కేంద్రం..

29 November 2022, 6:47 IST

google News
  • Centre returns 10 names recommended by SC Collegium : సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య ‘నియామకాల’ అంశంలో విభేదాలు మరింత ముదిరాయి! సుప్రీకోర్టు కొలీజియం.. ఇటీవలే చేసిన సిఫార్సులను కేంద్రం వెనక్కి పంపించేసింది. 

జడ్జీల నియామకాలపై 'సుప్రీం' సిఫార్సులను తిరస్కరించిన కేంద్రం..
జడ్జీల నియామకాలపై 'సుప్రీం' సిఫార్సులను తిరస్కరించిన కేంద్రం.. (HT_PRINT)

జడ్జీల నియామకాలపై 'సుప్రీం' సిఫార్సులను తిరస్కరించిన కేంద్రం..

Centre rejects 10 names recommended by SC Collegium : 10మందిని వివిధ హైకోర్టుల జడ్జీలుగా నియమించేందుకు.. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రం తిరస్కరించింది. ఈ మేరకు సంబంధిత ఫైళ్లను ఈ నెల 25నే వెనక్కి పంపించేసింది. జడ్జీలను నియమించడంలో కేంద్రం ఆలస్యం చేస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆసంతృప్తి వ్యక్తి చేసిన రోజే.. ఈ వార్త బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తిరస్కరణకు గురైన వారిలో పలువురు సీనియర్​ అడ్వకేట్లు సైతం ఉన్నారు. మాజీ సీజేఐ బీఎన్​ కిర్పాల్​ తనయుడు, సీనియర్​ అడ్వకేట్​ సౌరభ్​ కిర్పాల్​ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

"నేను ఒక గే. ఈ విషయం అందరికి తెలుసు. ఓ గేని ధర్మాసనంలో కూర్చోబెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదు. అందుకే నాకు ఇంతకాలం పదోన్నతి లభించలేదు," అని జాతీయ మీడియాకు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు సౌరభ్​ కిర్పాల్​.

Supreme court latest news : సౌరభ్​ కిర్పాల్​ పేరు తిరస్కరణకు గురవ్వడం ఇది మూడోసారి అని తెలుస్తోంది. 2017 నుంచి ఇప్పటివరకు.. ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం మూడుసార్లు సిఫార్సు చేసిందని సమాచారం. మరింత సమాచారం కావాలంటూ.. కేంద్రం ఆయన పదోన్నతిని తిరస్కరిస్తూ వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సుప్రీంకోర్టు అసంతృప్తి..

సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చే సిఫార్సులపై నిర్ణిత సమయంలోపు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ పిటిషిన్​ దాఖలైంది. దీనిపై ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme court government row : "కొలీజియం ఒక పేరు చెప్తే.. అక్కడితో కథ ముగిసినట్టే. కచ్చితంగా సిఫార్సు చేసిన పేరును కేంద్రం ఆమోదించాలి. కానీ పేర్లను పెండింగ్​లో పెట్టి.. హద్దు మీరుతోంది. ఈ విషయాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఈ విషయంపై మేము న్యాయపరమైన తీర్పును ఇచ్చే విధంగా చేయకండి," అని జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్​ ఏఎ ఓకాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

"మీరు పేర్లను హోల్డ్​ చేయడం.. మొత్తం వ్యవస్థను నిరుత్సాహపరుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో.. అందరిని కాకుండా, కొన్ని పేర్లనే ఆమోదిస్తున్నారు. సీనియారిటీకి మీరు విలువనివ్వడం లేదు," అని ధర్మాసనం మండిపడింది.

ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్​ రిజిజు ఇటీవలే స్పందించారు.

Supreme court of India : "1991కి ముందు.. న్యాయమూర్తులను కేంద్రమే ఎంపిక చేసేది. ఇప్పుడు కొలీజియం సిఫార్సు చేస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగానికి ఏలియన్​ వంటి తీర్పు," అని అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం