Supreme Court on Note ban: ‘నోట్ల రద్దు’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు-wont go into whether note ban objectives were met supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Won't Go Into Whether Note Ban Objectives Were Met: Supreme Court

Supreme Court on Note ban: ‘నోట్ల రద్దు’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 08:51 PM IST

Supreme Court on Note ban: 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా నోట్ల రద్దు సాధించిన విజయాలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

నోట్ల రద్దు సమయంలో ఏటీెఎం ముందు క్యూ లైన్ (ఫైల్ ఫొటో)
నోట్ల రద్దు సమయంలో ఏటీెఎం ముందు క్యూ లైన్ (ఫైల్ ఫొటో)

Supreme Court on Note ban: 2016 నవంబర్ 8 న కేంద్రం పెద్ద నోట్లైన రూ. 500, రూ. 1000లను రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించింది. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా గగ్గోలు రేకెత్తించింది. ఏటీఎంల ముందు కమీల పొడవైన క్యూ లైన్లకు, క్యూలైన్లలోనే చోటు చేసుకున్న మరణాలకు కారణమైంది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, ఆ సంవత్సరం డిసెంబర్ లో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించారు.

ట్రెండింగ్ వార్తలు

Supreme Court on Note ban: ఆ జోలికి వెళ్లం

నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత విచారణలో నోట్ల రద్దు నిర్ణయం చట్ట బద్ధంగా, సరైన ప్రొసీజర్ ను పాటిస్తూ తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే పరిశీలిస్తామని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. నోట్ల రద్దు నిర్ణయం అనుకున్న ఫలితాలను సాధించిందా? లేదా? అన్న విషయం అప్రస్తుతమని వ్యాఖ్యానించింది.

Supreme Court on Note ban: ఆర్బీఐ యాక్ట్

నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ చట్టంలోని 26(2) సెక్షన్ కేంద్రానికి అందించిన ప్రత్యేక అధికారానికి లోబడే తీసుకున్నారా?, అలాగే, ఈ నిర్ణయం తీసుకోవడంలో చట్టంలో పేర్కొన్న ప్రొసీజర్ ను పాటించారా? అనే విషయాలను మాత్రమే ఈ విచారణలో పరిశీలిస్తామని వెల్లడించింది. నోట్ల రద్దు నిర్ణయం విజయం సాధించిందా? లేదా? అన్న విషయం ఈ విచారణలో ప్రస్తావనకు రాబోదన్నారు.

Supreme Court on Note ban: పీ చిదంబరం వాదనలు

ఈ కేసులో ఒక పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం వాదనలు వినిపించారు. నోట్ల రద్దు నిర్ణయం దారుణంగా విఫలమైందని, ఆ నిర్ణయంతో న్యాయపాలనను అపహాస్యం చేశారని ఆయన వాదించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన సమయంలో పేర్కొన్న లక్ష్యాల్లో ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారని తెలిపారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లు మాయమవుతాయని, డ్రగ్ ట్రాఫికింగ్, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం నిలిచిపోతుందని హామీ ఇచ్చిన విషయాన్ని చిదంబరం గుర్తు చేశారు.

WhatsApp channel

టాపిక్