Google search : మరింత మెరుగ్గా ‘గూగుల్ సెర్చ్ రిజల్ట్స్’- ఆ కంటెంట్‌కు చెక్!
19 August 2022, 12:31 IST
- Google search results : గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌కు కొత్త అప్డేట్ తీసుకొస్తోంది ఆ సంస్థ. ఫలితంగా తక్కువ నాణ్యత, ఒరిజినల్ కాని కంటెంట్లు సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించడం తగ్గుతాయని గూగుల్ చెబుతోంది.
మరింత మెరుగ్గా ‘గూగుల్ సెర్చ్ రిజల్ట్స్’- ఆ కంటెంట్‌కు చెక్!
Google search results : ఈ టెక్ కాలంలో గూగుల్ సెర్చ్ లేనిదే మనిషికి రోజు గడవడం లేదు! విషయం పెద్దదైనా, చిన్నదైనా.. మనికి సమాచారం కావాలంటే.. బ్రౌజర్లో గూగుల్ సెర్చ్ చేయాల్సిందే కదా. అయితే.. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో.. మనకి అవసరమైన కంటెంట్‌తో పాటు అవసరం లేనివి కూడా చాలా వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అవే తొలుత కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల సమాచార సేకరణలో ఆలస్యం అవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది గూగుల్. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో తక్కువ నాణ్యతో కూడిన అంశాలను తొలగించి, ఒరిజినల్ కంటెంట్‌నే యూజర్లకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇందుకోసం 'హెల్ప్‌ఫుల్ కంటెంట్ అప్డేట్' పేరుతో కొత్త సెర్చ్ ర్యాంకింగ్ అప్డేట్ని.. ఈ నెల 22న లాంచ్ చేయనుంది గూగుల్. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంగ్లీష్‌లో అందుబాటులోకి రానుంది.
"సమాచారం కోసం కాకుండా.. కేవలం క్లిక్స్ కోసమే ఉండే లింక్‌లను చూసి యూజర్లు అసంతృప్తి చెందుతారని మాకు తెలుసు. అందువల్ల.. గూగుల్ సెర్చ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాము. వచ్చే వారం నుంచి ఇది ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త అప్డేట్ ద్వారా ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్‌ను సులభంగా యాక్సిస్ చేయవచ్చు," అని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.
Changes to google search results : గూగుల్‌లో కనిపించే వాటికి ర్యాంకింగ్స్ ఉంటాయి. ఒక లింక్‌కు ఎంత ఎక్కువ క్లిక్స్ లభిస్తే.. అది గూగుల్ సెర్చ్‌లో అంత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. వీటిల్లో ఒరిజినల్ కానివి, క్లిక్ బైట్స్, తక్కువ నాణ్యతతో కూడిన కంటెంట్ కూడా గూగుల్ సెర్చ్‌లో పైకి వస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది గూగుల్.
తాజాగా.. ఆన్‌లైన ఎడ్జ్యూకేషన్ మెటీరియల్, షాపింగ్, టెక్ కంటెంట్‌కి ఈ అప్టేడ్ ఉపయోగపడుతుంది!
"ఉదాహరణకు మీరు.. ఒక కొత్త సినిమాపై సమాచారం కోసం గూగుల్ సెర్చ్ చేశారు. ఇకపై గూగుల్‌లో ప్రత్యేకమైన, కచ్చితత్వంతో కూడిన సమాచారం లభిస్తుంది. అవి మీకు ఉపయోగపడతాయి. మా సిస్టమ్స్‌ని ఎప్పటికప్పుడు రిఫైన్ చేస్తున్నాము. రానున్న వారాల్లో.. యూజర్లకు ఉపయోగపడే మరెన్నో అప్డేట్స్ని తీసుకొస్తాము," అని గూగుల్ వెల్లడించింది.