తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rates Today : తగ్గిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా..

Gold rates today : తగ్గిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా..

Sharath Chitturi HT Telugu

20 September 2022, 6:22 IST

    • Gold rates today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ లెక్కలు..
నేటి బంగారం ధరల లెక్కలివే
నేటి బంగారం ధరల లెక్కలివే (REUTERS)

నేటి బంగారం ధరల లెక్కలివే

Gold rates today in telugu : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 45,850గా ఉంది. సోమవారం ఈ ధర రూ. 45,950గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 4,58,500కి చేరింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 దిగొచ్చి.. రూ. 50,020గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 50,130గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,00,200గా ఉంది.

Gold rates news : దేశవ్యాప్తంగా బంగారం ధరలు..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం కాస్త తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,000గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,170గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,850 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,020గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,320గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,530గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 45,880గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,050గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 45,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,020గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 45,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,070గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,020గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,670గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 56,700గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,700.. బెంగళూరులో రూ. 62,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 170 దిగొచ్చి.. రూ 23,040కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,210గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,040గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం