Gold and Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు....-gold and silver prices in todays bullion markets ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold And Silver Prices In Todays Bullion Markets

Gold and Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు....

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 05:27 AM IST

Gold and Silver Price today : బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ధరలు తగ్గినా సోమవారానికి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130గా నమోదైంది. వెండి ధర కూడా క్రమంగా పెరుగుతోంది.

Gold rate today: పెరుగుతున్న బంగారం ధరలు
Gold rate today: పెరుగుతున్న బంగారం ధరలు

Gold silver price today : బంగారం ధరల్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా గత కొద్ది నెలలుగా ధరలు పైకి వెళ్లాయి. శనివారం దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గినా మళ్లీ పైకి ఎగబాకాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ. 160పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 170 పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,130గా నమోదైంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

22 క్యారెట్ల బంగారం రేటు రూ.45,950 వద్ద కొనసాగుతోంది. ఇవాళ వెండిపై రూ. 300 పెరిగి హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.62,000గా ఉంది.

Gold silver price: ఆంధ్రప్రదేశ్‌లో ఇలా....

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.45,950గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,130గా నమోదైంది. వెండి ధర కిలో రూ. 62,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా....

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,100గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,280 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,130గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950 వద్ద కొనసాగుతోంది.

Platinum Price ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 130 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,130గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,130గా ఉంది.

IPL_Entry_Point