తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ghulam Nabi Azad : కాంగ్రెస్​ పార్టీకి గులాం నబీ ఆజాద్​ గుడ్​ బై

Ghulam Nabi Azad : కాంగ్రెస్​ పార్టీకి గులాం నబీ ఆజాద్​ గుడ్​ బై

Sharath Chitturi HT Telugu

26 August 2022, 12:23 IST

google News
    • Ghulam Nabi Azad resignation: కాంగ్రెస్​ నుంచి తప్పుకుంటున్నట్టు గులాం నబీ ఆజాద్​ ప్రకటించారు.
కాంగ్రెస్​ పార్టీ కి గులాం నబీ గుడ్​ బై
కాంగ్రెస్​ పార్టీ కి గులాం నబీ గుడ్​ బై

కాంగ్రెస్​ పార్టీ కి గులాం నబీ గుడ్​ బై

Ghulam Nabi Azad resignation: కాంగ్రెస్​ పార్టీకి అతి పెద్ద షాక్​ తగిలింది! ఆ పార్టీలోని అత్యంత సీనియర్​ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్​.. కాంగ్రెస్​కు శుక్రవారం గుడ్​ బై చెప్పారు. పార్టీ సభ్యుత్వంతో పాటు కాంగ్రెస్​లోని అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు రాజీనామాను అందించారు.

రాహుల్​పై తీవ్ర విమర్శలు..

ఈ మేరకు సోనియా గాంధీకి రాసిన.. నాలుగు పేజీల రాజీనామా లేఖలో రాహుల్​ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గులాం నబీ ఆజాద్​.

"రాహుల్​ గాంధీ అపరిపక్వతతో కాంగ్రెస్​కు తీవ్ర నష్టం జరుగుతోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ ఆర్డినెన్స్​ను మీడియా ముందు చింపివేశారు రాహుల్​ గాంధీ. చిన్నపిల్లాడిలా ఆయన ప్రవర్తిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఘోర పరాభవానికి ఇది ఒక కారణం. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. హడావుడిగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ," అని గులాం నబీ ఆజాద్​ మండిపడ్డారు.

రాహుల్​ గాంధీపై ఎవరికీ నమ్మకం లేదని విరుచుకుపడ్డారు గులాం నబీ ఆజాద్​. గాంధీతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్​లో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని పేర్కొన్నారు.

Ghulam Nabi Azad Congress : గాంధీలు దేశంలో లేని సమయంలో ఆజాద్​.. తన రాజీనామాను బయటపెట్టడం చర్చకు దారితీసింది. సోనియా గాంధీ చికిత్స కోసం, ఆమె వెంట రాహుల్​, ప్రియాంక గాంధీలు విదేశాలకు వెళ్లారు.

జమ్ముకశ్మీర్​ కాంగ్రెస్​ ప్రచార కమిటీ నుంచి ఈ నెల 16న తప్పుకున్నారు ఆజాద్​. ఆ తర్వాత కొన్ని రోజులకే.. పార్టీకి గుడ్​ బై చెప్పేశారు. అయితే.. గులాం నబీ ఆజాద్​ రాజీనామాను ముందే ఊహించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్​ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన 'జీ23'లో గులాం నబీ ఆజాద్​ కీలక సభ్యుడు. అప్పటి నుంచి ఆయన్ని గాంధీలు దూరం పెడుతూ వచ్చారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసినప్పటికీ.. ఆయనకు మరో అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్​.

సంక్షోభంలో కాంగ్రెస్​..

కాంగ్రెస్​కు తీవ్ర సంక్షోభం నెలకొంది. సీనియర్​ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. గాంధీల కుటుంబం ఏమీ చేయలేని పరిస్థితి!

Ghulam Nabi Azad Rahul Gandhi : గులాం నబీ ఆజాద్​కు ముందు.. పార్టీ సీనియర్​ నేత కపిల్​ సిబాల్​.. కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. ఎస్​పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

పార్టీని గట్టెక్కించి.. బీజేపీకి ధీటుగా నిలబడాలని భావిస్తున్న పార్టీ.. ‘భారత్​ జోడో యాత్ర’కు సిద్ధమవుతున్న వేళ.. గులాం నబీ ఆజాద్​ రాజీనామాకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘దేశాన్ని కాదు.. ముందు సొంత పార్టీని కలిసిగట్టుగా నడిపించుకోండి,’ అంటూ ప్రత్యర్థులు పార్టీని విమర్శిస్తున్నారు.

మరోవైపు.. కాంగ్రెస్​కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్​.. తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాపిక్

తదుపరి వ్యాసం