Footballer death : షాకింగ్.. మ్యాచ్ మధ్యలో పిడుగు పడి ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి- వీడియో వైరల్!
13 February 2024, 6:32 IST
- Indonesia footballer viral video : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అనేందుకు ఉదాహరణ తాజా ఘటన! ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ ప్లేయర్‌పై పిడుగు పడింది. అతను మరణించాడు.
షాకింగ్.. మ్యాచ్ మధ్యలో పిడుగు పడి ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి- వీడియో వైరల్!
Lightening hits footballer : ఇండోనేషియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా ఫీల్డ్‌పై ఉన్న ఓ పుట్‌బాల్ ప్లేయర్‌పై పిడుగు పడింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అనేందుకు ఇది ఓ ఉదాహరణగా నిలిచింది. అప్పటివరకు చురుకుగా మ్యాచ్ ఆడుతున్న వ్యక్తి జీవితం ముగిసింది!
ఇదీ జరిగింది..
ఇండోనేషియా పశ్చిమ జావాలోని బండుంగ్ అనే ప్రాంతంలో ఉన్న శిలివంగి స్టేడియంలో గత శనివారం జరిగింది ఈ ఘటన. 2 ఎఫ్ఎల్ఓ ఎఫ్‌సీ బుండంగ్, ఎఫ్‌పీఐ సుబంగ్ జట్ల మధ్య ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం.. 4 గంటల 20 నిమిషాలకు గ్రౌండ్ మీద పిడుగు పడింది. అదే సమయంలో అక్కడ.. 35ఏళ్ల సెప్టైన్ రహర్జ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ ఉన్నాడు. అతనిపై డైరక్ట్‌గా పిడుగు పడింది. అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అతని వద్దకు పరుగులు తీశారు. అప్పటికి అతను ఊపిరి తీసుకుంటున్నాడని, ప్లేయర్‌ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. కానీ ఆసుపత్రిలో అతను ప్రాణాలు కోల్పోయాడని సమాచారం.
ఈ ఘటన యావత్ స్పోర్ట్స్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఇండోనేషియా జట్లు.. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
Footballer death news : స్టేడీయం మీద 300 మీటర్ల దూరం నుంచి పిడుగు పడిందని క్లైమెటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ విశ్లేషణ సూచించింది. అయితే.. ఇండోనేషియాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌పై పిడుగు పడటం ఇది మొదటిసారి కాదు. 2023లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తూర్పు జావాలో సోరాటిన్ యూ-13 కప్ జరుగుతుండగా.. ఓ బాలుడిపై పిడుగు పడింది. అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు అతడిని బతికించారు!
ఇక ప్రస్తుత ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. "మాటలు రావడం లేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.