తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chatgpt: ‘రష్యా, ఉక్రెయిన్’ సమస్యకు చాట్ జీపీటీ చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసా?

ChatGPT: ‘రష్యా, ఉక్రెయిన్’ సమస్యకు చాట్ జీపీటీ చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu

11 March 2023, 15:03 IST

    • ChatGPT solution for Russia-Ukraine conflict: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆ రెండు దేశాలనే కాకుండా, ప్రపంచ దేశాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ సమస్య పరిష్కారానికి కృత్రిమ మేథతో పని చేసే చాట్ జీపీటీ (ChatGPT) చెప్పిన పరిష్కారం ఆసక్తికరంగా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ChatGPT solution for Russia-Ukraine conflict: చాట్ జీపీటీ.. సంచలనం సృష్టిస్తున్న సాంకేతిక విప్లవం. కృత్రిమ మేథ సహాయంతో ఏ ప్రశ్నకైనా సమాధానంతో సిద్ధంగా ఉంటోంది. తాజాగా, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి, రచయిత వికాస్ స్వరూప్ (Vikas Swarup) చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చెప్పాలని చాట్ జీపీటీ (ChatGPT) ని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

ChatGPT solution for Russia-Ukraine conflict: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి చాట్ జీపీటీ పరిష్కారం..

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోవడానికి ఆ రెండు దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం చేపట్టాల్సిన చర్యలను చాట్ జీపీటీ (ChatGPT) వివరించింది. మొత్తం 8 సూచనలను చేసింది. అయితే, ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అని, ఇరు వర్గాలను ఒప్పించి పరిష్కారం సాధించడం అంత సులభం కాదని ముందే స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని రష్యా భాష మాట్లాడే ప్రాంతాలను డీసెంట్రలైజ్ చేయాలని చాట్ జీపీటీ (ChatGPT) సూచించింది. అలాగే, యుద్ధ విరమణ అగ్రిమెంట్ కుదిరిన తరువాత ఆ అగ్రిమెంట్ అమలును అంతర్జాతీయ వ్యవస్థ మానిటర్ చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి ముందుగా, రెండు దేశాలు యుద్ధ విరమణకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించి, ఒక తటస్థ వేదికపై చర్చలు జరపాలని ChatGPT సూచించింది.

Demilitarisation of conflict zone: ఉక్రెయిన్ ఆర్థిక సాయం

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకోవాలని చాట్ జీపీటీ (ChatGPT) సూచించింది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రష్యా అంగీకరించాలని పేర్కొంది. ఉక్రయిన్ లోని రష్యా భాష మాట్లాడే ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ కోసం రష్యా, ఉక్రెయిన్ ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ సమాచార విధానాల్లో రష్యా భాషను భాగం చేయాలని సూచించింది. రెండు దేశాల సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు పిలిపించి, ఆ ప్రాంతాలను డీమిలటరైజ్ చేయాలని ChatGPT సూచించింది.

Shashi Tharoor comments on ChatGPT solution: శశి థరూర్ స్పందన

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి చాట్ జీపీటీ చేసిన సూచనలను వికాస్ స్వరూప్ (Vikas Swarup) ట్విటర్ లో పంచుకున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) స్పందించారు. యుద్ధాలకు, సంక్షోభాలకు కారణమయ్యే నేతలు చాట్ జీపీటీ (ChatGPT) వంటి కృత్రిమ మేథలకు అర్థం కానంత నిర్హేతుకంగా ఉంటారని వ్యాఖ్యానించారు. చాట్ జీపీటీ చేసిన సూచనలను రష్యా, ఉక్రెయిన్ రెండూ అంగీకరించబోవన్నారు. అయితే, వికాస్ స్వరూప్ (Vikas Swarup) ప్రయత్నం ఆసక్తికరంగా ఉందని శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు.