Biden visits Ukraine: హఠాత్తుగా ‘యుద్ధభూమి’ ఉక్రెయిన్‍లో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు.. జెలెన్‍స్కీకి హామీ
Joe Biden visits Ukraine: రష్యా యుద్ధంతో (Russia - Ukraine War) తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‍లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హఠాత్తుగా పర్యటించారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలై మరో నాలుగు రోజుల్లో సంవత్సరం (First anniversary of Russia Invasion in Ukraine) కానుండగా.. ఈ సందర్భంగా బైడెన్ కీవ్‍లో అడుగుపెట్టారు.
US President Joe Biden visits Ukraine: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్‍లోని కీవ్ (Kyiv)లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 20) కీవ్‍లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‍స్కీ(Volodymyr Zelenskyy)ని కలిశారు. ఉక్రెయిన్‍లో రష్యా యుద్ధం (Russia - Ukraine War) ప్రారంభించి మరో నాలుగు రోజుల్లో ఏడాది పూర్తికానున్న సందర్భంగా ఆ దేశంలో అగ్రరాజ్యాధినేత అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‍లో బైడెన్ పర్యటించడం ఇదే తొలిసారి.
మరిన్ని ఆయుధాలను ఇస్తాం
US President Joe Biden visits Ukraine: పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీతో సమావేశమయ్యారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఉక్రెయిన్‍కు మరిన్ని ఆయుధాలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయుధాలు, నిఘా వ్యవస్థలను ఇస్తామని చెప్పారు. రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్‍ను పూర్తి మద్దతునిస్తామని ప్రకటించారు. రష్యాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని జెలెన్‍స్కీతో బైడెన్ చెప్పారు. ఉక్రెయిన్ మిలటరీ ఆఫీసర్లు యూనిఫామ్ ధరించి వరుసగా నిలబడగా.. బైడెన్, జెలెన్‍స్కీ నడుస్తూ వెళ్లారు.
యుద్ధానికి ఏడాది
First anniversary of Russia Invasion in Ukraine: 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‍లో రష్యా ప్రవేశించింది. అప్పటి నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. భీకర దాడులకు పాల్పడుతోంది. రష్యా సైనికులు ఉక్రెయిన్ భూభాగంపై నుంచి దాడులు చేస్తుంటే, యుద్ధ విమానాలు ఆకాశం నుంచి క్షిపణులు కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. రష్యాకు కూడా ప్రాణ నష్టం జరిగింది. ఉక్రెయిన్‍లో మౌలిక సదుపాయాలు, వేలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాపై చాలా ఆంక్షలు విధించాయి. అయినా, యుద్దం ప్రారంభమై ఏడాది సమీపిస్తున్నా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‍లోని కొన్ని నగరాలు ఇప్పటికీ రష్యా ఆధీనంలో ఉన్నాయి. తరచూ ఉక్రెయిన్‍పై రష్యా దాడులకు పాల్పడుతోంది.
US President Joe Biden visits Ukraine: మరోవైపు యుద్ధానికి సహకరించేందుకు రష్యాకు చైనా ఆయుధాలను పంపుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో బైడెన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
రష్యాకు గెలిచే అవకాశమే లేదు
US President Joe Biden visits Ukraine: యుద్ధంలో తమపై రష్యా గెలిచే అవకాశమే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీ అన్నారు. బైడెన్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కలిసికట్టుగా మనం మన నగరాలను, ప్రజలకు రష్యా ఉగ్రవాదం నుంచి కాపాడుకుందాం” అని జెలెన్‍స్కీ అన్నారు.