Elon Musk - ChatGPT: చాట్ జీపీటీకి పోటీని తెచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్.. టీమ్ ఎంపిక!-elon musk plans to develop chatgpt rival team recruitment start ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Elon Musk Plans To Develop Chatgpt Rival Team Recruitment Start

Elon Musk - ChatGPT: చాట్ జీపీటీకి పోటీని తెచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్.. టీమ్ ఎంపిక!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2023 10:31 AM IST

Elon Musk - ChatGPT: చాట్‍జీపీటీకి పోటీగా ఏఐ చాట్‍బోట్‍ను తీసుకొచ్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం టీమ్‍ను కూడా ఆయన ఎంపిక చేసుకున్నారని సమాచారం.

Elon Musk - Chat GPT: చాట్ జీపీటీకి పోటీని తెచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్
Elon Musk - Chat GPT: చాట్ జీపీటీకి పోటీని తెచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్ (AFP/file)

Elon Musk - ChatGPT: ప్రపంచమంతా చాట్‍ జీపీటీ (ChatGPT) విపరీతంగా పాపులర్ అయింది. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఈ ఏఐ ఆధారిత చాట్ బోట్ సక్సెస్ అవటంతో చాలా కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. తాజాగా టెస్లా, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా చాట్‍జీపీటీకి పోటీగా ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ను రూపొందించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇందుకోసం ఏఐ రీసెర్చర్లతో కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నారని రిపోర్టులు వెల్లడయ్యాయి. ఏఐ ప్లాట్‌‍ఫామ్ కోసం టీమ్‍ను కూడా నియమించుకోవడం మస్క్ మొదలుపెట్టారట. ఇందుకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Elon Musk - ChatGPT: చాట్ జీపీటీకి పోటీగా ప్లాట్‍ఫామ్‍ను రూపొందించేందుకు ఇగోర్ బాబుస్కిన్‍ (Igor Babuschkin)ను ఎలాన్ మస్క్ నియమిస్తున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్‍కు చెందిన డీప్ మైండ్ ఏఐ యూనిట్‍ నుంచి ఇగోర్ ఇటీవలే బయటికి వచ్చారు. ఆయనను మస్క్ నియమించుకున్నారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే, ఇగోర్ ఇంకా అధికారికంగా సైన్ చేయలేదని తెలుస్తోంది.

Elon Musk - ChatGPT: నాన్ ప్రాఫిట్ స్టార్టప్‍గా ఓపెన్ ఏఐ సంస్థను 2015లో సామ్ ఆల్టమన్ స్థాపించినప్పుడు ఎలాన్ మస్క్ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే 2018లో ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. ఆ ఓపెన్ ఏఐ సంస్థనే ఇప్పుడు చాట్‍జీపీటీని సృష్టించింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది.

ChatGPT: చాట్‍జీపీటీ కొంతకాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఏ ప్రశ్నకైనా వివరంగా టెక్స్ట్ రూపంలో సమాధానాలు చెబుతుండడంతో ఈ ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ పాపులర్ అయింది. వ్యాసాలు, కంప్యూటర్ కోడింగ్, సాహిత్యం, మ్యాథమ్యాటిక్స్ ఇలా ఏ విషయంపై అయినా చాట్ జీపీటీ ఆన్సర్లు ఇచ్చేస్తుంది. అది కూడా వివరంగా ఒకే సమాధానాన్ని టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ప్రశ్నను టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తే చాలు.

ఐదేళ్ల క్రితం అలా..

Elon Musk - ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైనది అంటూ 2018లో ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అందరికీ సురక్షితంగా ఉండేలా ఏఐ ప్లాట్‍ఫామ్‍లు తయారవుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు ప్రభుత్వ విభాగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ తనను భయపెడుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చాట్ జీపీటీకి వస్తున్న ఆదరణతో మస్క్ కూడా ఏఐ బాటపట్టారు. ఏఐ చాట్ బోట్‍ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరోవైపు గూగుల్ కూడా బార్డ్ పేరుతో ఏఐ చాట్‍బోట్‍ను తీసుకొస్తోంది. దీన్ని ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం గూగుల్ బార్డ్ టెస్టింగ్ జరుగుతోంది. రానున్న వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం