Google’s ChatGPT Rival ‘Bard’: ఇంటర్నెట్‍లో చాట్‍జీపీటీ సంచలనంగా మారింది. ఏ ప్రశ్నకైనా వివరంగా, సులభతరంగా టెక్ట్స్ రూపంలో సమాధానాలు ఇస్తుండటంతో చాట్‍జీపీటీ (ChatGPT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‍బోట్ (AI-Powered Chatbot) కొంతకాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. మూడు నెలల్లోనే కోట్లాది మంది యూజర్లను ఈ ఏఐ కన్వర్జేషన్ టూల్ సంపాదించుకుంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ ఈ చాట్‍జీపీటీని తెచ్చింది. దీంతో, టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఇప్పుడు చాట్‍జీపీటీ లాంటి ఏఐ చాట్‍బోట్ (AI Chatbot) ను తీసుకొస్తోంది. బార్డ్ (Bard) పేరుతో దీన్ని తీసుకురానుంది. రానున్న వారాల్లో ఈ గూగుల్ బార్డ్ ఏఐ చాట్‍బోట్ (Google Bard AI Chatbot) టూల్ అందుబాటులోకి రానుంది. ఈ బార్డ్ గురించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ప్రకటించారు. ముఖ్యమైన 5 విషయాలు ఇవే.
“కమింగ్ సూన్: బార్డ్, LaMDAతో కూడిన సరికొత్త ప్రయోగాత్మక కన్వర్జేషనల్ గూగుల్ఏఐ సర్వీస్ వస్తోంది” అని సుందర్ పిచాయ్ కొన్ని ట్వీట్లు చేశారు. బార్డ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన కీలకమైన విషయాలు ఇవే.
Google Bard AI-Powered Chatbot: వెబ్‍లోని డేటా బేస్, సమాచారాన్ని ఉపయోగించుకొని యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఈ గూగుల్ ‘బార్డ్’ చాట్‍బోట్.. తాజా, నాణ్యమైన, వివరమైన సమాధానాలను ఇస్తుంది. క్లిష్టమైన సమాధానాలను సులభంగా అర్థమయ్యేలా టెక్స్ట్ రూపంతో చూపిస్తుంది. అంటే చాట్‍జీపీటీ (ChatGPT) లానే పని చేస్తుంది. యూజర్లు ఏదైనా ప్రశ్నను టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేస్తే వివరంగా సమాధానాన్ని టెక్స్ట్ రూపంలో ఇస్తుంది. ఈ బార్డ్ చాట్‍బోట్‍తో యూజర్లు టెక్ట్స్ ద్వారా ముచ్చటిస్తూ (Conversation) ప్రశ్నలు అడగొచ్చు.
Google Bard AI-Powered Chatbot: “మా లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (LaMDA) ద్వారా నెక్స్ట్ జెన్ లాంగ్వేజ్+ కాన్వర్జేషన్ సామర్థ్యాన్ని మేం 2021లోనే పరిచయం చేశాం. దీని ఆధారంగా పని చేసే ‘బార్డ్’ అతిత్వరలో వస్తుంది. LaMDAతో కూడిన కొత్త ప్రయోగాత్మక కాన్వర్జేషనల్ గూగుల్ఏఐ సర్వీస్ ఇది” అని సుందర్ పిచాయ్ వివరించారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రయాణంలో బార్డ్ కీలకమైన ముందడుగు అని అభివర్ణించారు.
Google Bard AI-Powered Chatbot: ప్రస్తుతం బార్డ్ ఏఐ చాట్‍బోట్ టూల్.. ట్రస్టెడ్ యూజర్లకు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ నడుస్తోంది. రానున్న వారాల్లో అందరికీ బార్డ్ ఏఐ చాట్‍బోట్‍ను అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది
Google Bard: గూగుల్ LaMDAతో ఈ బార్డ్ పని చేస్తుంది. దీని లైట్‍వైట్ మోడల్ వెర్షన్‍తో ఈ చాట్ బోట్ ఉంటుంది. ‘బార్డ్’ మరింత అత్యుత్తమంగా, నాణ్యతగా, సురక్షితమైన, కచ్చితమైన సమాధానాలు ఇచ్చేందుకు ఎక్స్‌టర్నల్ ఫీడ్‍బ్యాక్‍ను గూగుల్ తీసుకుంటోంది. ఇంటర్నల్ టెస్టింగ్‍ను కూడా తీవ్రంగా చేస్తోంది.
లాంగ్వేజ్ మోడల్‍పై ఏఐ పవర్డ్ చాట్‍బోట్‍ను చాలాకాలం నుంచి రూపొందిస్తోంది గూగుల్. అయితే సంస్థలోని కొందరు ఉద్యోగులు ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు చేయటంతో పబ్లిక్ రోల్అవుట్‍ను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే చాట్‍జీపీటికి ఊహించిన రీతిలో పాపులారిటీ రావటంతో గూగుల్ కూడా రంగంలోకి దిగింది. బార్డ్ (Google Bard) ఏఐ పవర్డ్ చాట్‍బోట్‍ను తీసుకొస్తోంది.
సంబంధిత కథనం