World's richest person : అపర కుబేరుల జాబితాలో ఎలాన్​ మస్క్​ @1-elon musk becomes world s richest again on tesla shares surge see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  World's Richest Person : అపర కుబేరుల జాబితాలో ఎలాన్​ మస్క్​ @1

World's richest person : అపర కుబేరుల జాబితాలో ఎలాన్​ మస్క్​ @1

Sharath Chitturi HT Telugu
Feb 28, 2023 10:44 AM IST

World's richest person : వరల్డ్స్​ రిచెస్ట్​ పర్సన్​గా తిరిగి నెంబర్​ 1 స్థానాన్ని దక్కించుకున్నారు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​. టెస్లా షేర్లు రాణించడంతో ఆయకు మళ్లీ ఈ అవకాశం దక్కింది.

ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (via REUTERS)

World's richest person : దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. సోమవారం అమెరికా స్టాక్​ మార్కెట్ల ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఎలాన్​ మస్క్​ నెట్​ వర్త్​ 187.1 బిలియన్​ డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్​ లగ్జరీ బ్రాండ్​ లూయిస్​ విట్టన్​ ఓనర్​, సీఈఓ బెర్నార్డ్​ ఆర్నాల్ట్​ (185.3 బిలియన్​ డాలర్లు)ను ఎలాన్​ మస్క్​ వెనక్కి నెట్టారు. ఈ విషయాన్ని బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ స్పష్టం చేస్తోంది.

మూడు నెలల్లోనే నెంబర్​ 1..

Elon Musk net worth : అపర కుబేరుల జాబితాలో.. గతేడాది నవంబర్​- డిసెంబర్​ వరకు ఎలాన్​ మస్కే తొలి స్థానంలో ఉండేవారు. కాగా.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన సంపద 200 బిలియన్​ డాలర్ల మేర కరిగిపోయింది. టెస్లా షేర్ల దారుణ పతనం ఇందుకు ముఖ్య కారణం. వాల్​ స్ట్రీట్​లో ఆ కంపెనీ షేర్లు చరిత్రలోనే అత్యంత దారుణ ప్రదర్శన చేశాయి. దాదాపు 700 బిలియన్​ డాలర్ల సంపద ఆవిరైపోయింది. అదే సమయంలో మస్క్​ ట్విట్టర్​ని కొనుగోలు చేయడం, అనంతరం నెలకొన్న అనిశ్చితిలో మరికొంత సంపద కరిగిపోయింది. ట్విట్టర్​ కొనుగోలుకు దాదాపు 44 బిలియన్​ డాలర్లను వెచ్చించారు ఎలాన్​ మస్క్​.

ఇక ఇప్పుడు ఈ ఏడాది.. టెస్లా షేర్లు బలంగా పుంజుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 90శాతం పెరిగాయి. ఫలితంగా.. ఏడాది తొలినాళ్లల్లో 137 బిలియన్​ డాలర్లుగా ఉన్న ఎలాన్​ మస్క్​ సంపద.. ఇప్పుడు 187 బిలియన్​ డాలర్లకు చేరింది.

టెస్లా జోరుతో..

Elon Musk latest news : ఎలాన్​ మస్క్​కు టెస్లాలో 13శాతం వాటా ఉంది. అంతేకాకుండా రాకెట్​ మేన్యుఫ్యాక్చరింగ్​ సంస్థ అయిన స్పేస్​ఎక్స్​కు ఆయన సీఈఓగానూ పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్​ సీఈఓగా తప్పుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మస్క్​.

ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్​ బాస్​ జెఫ్​ బెజోజ్​ మూడో స్థానంలో ఉండగా.. ఒరాకిల్​కు చెందిన లారి ఎల్లిసర్​ నాలుగో సీటును దక్కించుకున్నారు. ప్రముఖ ఇన్​వెస్టర్​ వారెన్​ బఫెట్​.. 106 బిలియన్​ డాలర్ల సంపదతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి.. రిలయన్స్​ అధిపతి ముకేశ్​ అంబానీ.. 84.3 బిలియన్​ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు.