తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In Japan : భారీ భూకంపంతో వణికిపోయిన జపాన్​.. టర్కీలో కూడా!

Earthquake in Japan : భారీ భూకంపంతో వణికిపోయిన జపాన్​.. టర్కీలో కూడా!

Sharath Chitturi HT Telugu

11 August 2023, 9:15 IST

google News
  • Earthquake in Japan : 6.0 తీవ్రతతో జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. మరోవైపు టర్కీని కూడా భూకంపం వణికించింది.

జపాన్​లో భారీ భూకంపం..
జపాన్​లో భారీ భూకంపం..

జపాన్​లో భారీ భూకంపం..

Earthquake in Japan : జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. హొక్కైడో ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ విషయాన్ని జర్మన్​ జియోసైన్స్​ రీసెర్చ్​ సెంటర్​ వెల్లడించింది.

భూమికి 46 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా.. జపాన్​ భూకంపం ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించలేదు. కాగా.. భూకంపం కారణంగా ప్రజలు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

జపాన్​లో తరచుగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. ప్రజలు నిత్యం భయంతో జీవిస్తుంటారు.

టర్కీలో కూడా..!

Turkey earthquake today : మరోవైపు టర్కీలోనూ భూకంపం సంభవించింది. యూరోపియన్​ మెడిటరేనియన్​ సీస్మొలాజికల్​ సెంటర్​ ప్రకారం.. మలత్యా ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు భూమి కంపించింది. భూమికి 10 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది.

"మలత్యాకు 10కి.మీల దూరంలో భూకంపం నమోదైంది. పలు భవనాలు ఊగిపోయాయి. ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది," అని అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం.. టర్కీ భూకంపంలో 23మంది ప్రజలు గాయపడ్డారు. చాలా మంది.. ప్రాణాలు కాపాడుకోవడానికి భవనాల నుంచి బయటకు దూకేశారు. పలు భవనాలు దెబ్బతిన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపం నుంచి టర్కీ ఇంకా కోలుకోలేదు. ఫిబ్రవరిలో దాదాపు 4,5 భూకంపాలు ప్రజలను భయపెట్టాయి. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వేరువేరు ఘటనల్లో మృతుల సంఖ్య దాదాపు 50వేలుగా నమోదైంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

తదుపరి వ్యాసం