తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Potatoes Missing: పావుకేజీ బంగాళాదుంపలు చోరీ; పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయ్ వర్మ

potatoes missing: పావుకేజీ బంగాళాదుంపలు చోరీ; పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయ్ వర్మ

Sudarshan V HT Telugu

02 November 2024, 14:42 IST

google News
  • తన ఇంట్లో నుంచి పావు కేజీ బంగాళా దుంపలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. అది కూడా, అర్ధరాత్రి ఎమర్జెన్సీ కాల్ చేసి. ఈ వార్త వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన ఇంట్లో నుంచి 250 గ్రాముల బంగాళాదుంపలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫోన్ చేశాడు.

పావుకేజీ బంగాళాదుంపలు చోరీ
పావుకేజీ బంగాళాదుంపలు చోరీ (X/@Dennis0D0Menace)

పావుకేజీ బంగాళాదుంపలు చోరీ

VIRAL NEWS: ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఒక అసాధారణ అత్యవసర కాల్ ను రిసీవ్ చేసుకున్నారు. తన ఇంటిలో నుండి 250 గ్రాముల బంగాళాదుంపలను ఎవరో దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. విజయ్ వర్మ అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో యూపీ-112 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి, తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు విజయ్ వర్మ ఇంట్లో నుంచి ఏం దొంగతనం జరిగాయో తెలుసుకుని అవాక్కయ్యారు.

బంగాళాదుంపల చోరీ..

తన ఇంట్లో సుమారు పావు కేజీ బంగాళాదుంపలు ఉండాలని, తాను బయటకు వెళ్లి వచ్చేసరికి వాటిని ఎవరో దొంగలించారని, వారిని వెతికిపట్టుకుని, తన బంగాళాదుంపలను తిరిగి తెచ్చివ్వాలని విజయ్ వర్మ అనే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నుంచి బంగాళాదుంపలను దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మద్యం మత్తులో విజయ్ వర్మ పోలీసులకు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వింత కేసు విషయం సోషల్ మీడియాలో రావడంతో అది వైరల్ గా మారింది.

తాగి వచ్చి కూర వండుకుందామని..

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో ఉన్న మన్నపుర్వాకు చెందిన విజయ్ వర్మ అనే వ్యక్తి బంగాళాదుంపలను వంట కోసం సిద్ధం చేసి, మద్యం తాగి వచ్చి, వంట చేద్దామని, వాటిని అక్కడే వదిలి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి ఆ బంగాళాదుంపలు అక్కడ కనిపించలేదు. దాంతో, వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వర్మ ఇంటికి వచ్చిన పోలీసులు ఆ ఇంట్లో కేవలం 250 గ్రాముల బంగాళాదుంపలు మాత్రమే చోరీకి గురైనట్లు తెలుసుకుని అవాక్కయ్యారు.

కచ్చితంగా పట్టుకోవాలి..

పోలీసులు ఈ అసాధారణ ఫిర్యాదును, ఆ వ్యక్తితో సంభాషించిన వీడియోను రికార్డ్ చేశారు, "దీన్ని కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది" అని విజయ్ వర్మ పట్టుబట్టారు. మీరు తాగి ఉన్నారా అన్న ప్రశ్నకు తాను తాగినట్లు అంగీకరించాడు, "అవును, నేను రోజంతా కష్టపడతాను. సాయంత్రం ఒక చిన్న పానీయం తీసుకుంటాను. కానీ ఇది ఆల్కహాల్ గురించి కాదు. ఇది తప్పిపోయిన బంగాళాదుంపల గురించి" అని సమాధానమిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియా (social media) లో వైరల్గా మారింది. వీక్షకులు అనేక రకాల ప్రతిస్పందనలను వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసుల ప్రతిస్పందనను ప్రశంసించారు. మరికొందరు అత్యవసర సేవల దుర్వినియోగాన్ని విమర్శించారు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్