తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump Indicted : ‘పోర్న్​ స్టార్​కు ట్రంప్​ డబ్బులిచ్చారు’- మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు!

Donald Trump indicted : ‘పోర్న్​ స్టార్​కు ట్రంప్​ డబ్బులిచ్చారు’- మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు!

Sharath Chitturi HT Telugu

04 April 2023, 17:15 IST

google News
  • Donald Trump indicted : 2016 ఎన్నికలకు ముందు  ఓ పోర్న్​ స్టార్​కు డొనాల్డ్​ ట్రంప్​ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రుజువయ్యాయి! ఇందుకు సంబంధించి.. న్యూయార్క్​లోని గ్రాండ్​ జ్యూరీ అమెరికా మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు మోపింది.

డొనాల్డ్​ ట్రంప్​
డొనాల్డ్​ ట్రంప్​ (AP)

డొనాల్డ్​ ట్రంప్​

Donald Trump indicted news : 'హష్​ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభియోగాలు మోపేందుకు న్యూయార్క్​ గ్రాండ్​ జ్యూరీ సిద్ధమైంది. ఫలితంగా.. 2016 ఎన్నికలకు ముందు.. ట్రంప్​ ఓ పోర్న్​ స్టార్​కు భారీ మొత్తంలో చెల్లింపులు చేశారన్న ఆరోపణలు నిజమయ్యాయి. ఓ మాజీ/ సిట్టింగ్​ అధ్యక్షుడిపై వేసిన నేరారోపణలు రుజువైన తొలి వ్యక్తిగా.. డొనాల్డ్​ ట్రంప్​ దేశ చరిత్రలో నిలిచిపోనున్నారు.

త్వరలోనే డొనాల్డ్​ ట్రంప్​ అరెస్ట్​..!

ఈ అభియోగాలకు సంబంధించిన ఛార్జీలను మ్యాన్​హట్టన్​ జిల్లా అటార్నీ కార్యాలయం ప్రస్తుతం సీల్డ్​ కవర్​లో ఉంచినట్టు, త్వరలోనే వీటిని ప్రకటించనున్నట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదే జరిగితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొనాలని భావిస్తున్న ట్రంప్​ ఆశలు ఆవిరైపోతాయి!

Donald Trump news latest : దశాబ్ద కాలం క్రితం.. డొనాల్డ్​ ట్రంప్​ తనతో లైంగికంగా కలిసినట్టు పోర్న్​ స్టార్​ స్టోర్మీ డేనియల్స్​ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. 2016 ఎన్నికలకు ముందు ట్రంప్​ తనకు 1,30,000 డాలర్లు చెల్లించినట్టు ఆమె ఆరోపించారు. 2019లో ట్రంప్​ మాజీ న్యాయవాది మైకెల్​ కోహెన్​.. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్​ ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్​ తరఫున తాను స్టోర్మీ డేనియల్స్​కు డబ్బులు చెల్లించినట్టు తెలిపారు.

ట్రంప్​పై వచ్చిన ఆరోపణలను మ్యాన్​హట్టన్​లోని గ్రాండ్​ జ్యూరీ ప్యానెల్​ కొంత కాలం పాటు విచారణ జరిపింది. కేసుకు సంబంధించిన సాక్ష్యులను విచారించింది. కాగా.. ప్రస్తుతం డొనాల్డ్​ ట్రంప్​పై మూడు పెద్ద కేసులు ఉన్నాయి. వీటిల్లో డొనాల్డ్​ ట్రంప్​ ఛార్జీలు ఎదుర్కొంటుండటం ఇదే మొదటిది. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 2021 జనవరి 6న జరిగిన 'క్యాపిటల్​' దాడి ఘటనలో డొనాల్డ్​ ట్రంప్​ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.

Donald Trump Stormy Daniels : తాజా పరిణామాలను డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. తనను రాజకీయ నేతలు కావాలనే వేటాడుతున్నారని ఆరోపించారు. తనను త్వరలోనే అరెస్ట్​ చేసే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

Stormy Daniels Donald trump case : డొనాల్డ్​ ట్రంప్​పై నేరారోపణలు రుజవైన నేపథ్యంలో న్యూయార్క్​ వాతావరణ వేడెక్కింది. ట్రంప్​ మద్దతుదారులు నిరసనలు తెలిపే అవకాశం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను పెంచారు.

తదుపరి వ్యాసం