తెలుగు న్యూస్  /  National International  /  Does Elon Musk Have Enough Money To Buy Twitter?

Elon Musk | ట్విట్టర్​ 'డీల్​ 'నుంచి మస్క్​ తప్పుకుంటారా?

HT Telugu Desk HT Telugu

28 April 2022, 13:29 IST

    • అమెరికా: ఎలాన్​ మస్క్​తో డీల్​ పూర్తవడంతో ట్విట్టర్​ షేర్​హోల్డర్లు పండగ చేసుకున్నారు. కానీ డీల్​ను పూర్తిచేసేందుకు అసలు మస్క్​ వద్ద అంత నిధులున్నాయా? అన్న అనుమానాలు తాజాగా మొదలయ్యాయి. ఫలితంగా ట్విట్టర్​ షేర్లు పతనమయ్యాయి. మస్క్​ డీల్​ నుంచి తప్పుకుంటారా?
ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (REUTERS/file)

ఎలాన్​ మస్క్​

Elon musk buys twitter | ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలాన్​ మస్క్​- ట్విట్టర్​ డీల్​ గురించే చర్చ. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ మస్క్​ అనుకున్నది సాధించారు. నిరాకరించేందుకు వీలు లేని విధంగా భారీ డీల్​ను ఆఫర్​ చేసి ట్విట్టర్​ను తన వశం చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ.. డీల్​ను పూర్తిచేసేందుకు మస్క్​ వద్ద కావాల్సిన డబ్బులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

మస్క్​- ట్విట్టర్​ మధ్య 44బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఫలితంగా ట్విట్టర్​ షేర్​ ప్రైజ్​ పెరిగింది. కానీ.. ట్విట్టర్​ డీల్​ను పూర్తి చేసేందుకు మస్క్​ వద్ద నిధులున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవ్వడంతో షేర్లు పడ్డాయి. డీల్​ను మొత్తం నిధుల రూపంలో క్లోజ్​ చేసేందుకు మస్క్​కు సాధ్యం కాదని ట్రేడర్లు భావిస్తున్నారు. 21బిలియన్​ డాలర్ల నిధుల రూపంలో ఇచ్చి, తన టెస్లాలోని వాటాను అమ్ముతారేమో అని ఆశిస్తున్నారు. ఫలితంగా టెస్లా షేర్లు కూడా పడ్డాయి.

మస్క్​ వెనకడుగేస్తారా?

Elon Musk twitter | అసలు తెరపైకి 'డీల్​', 'ఆఫర్​' అనే పదాలు రాక ముందు.. ట్విట్టర్​లో మస్క్​ 9శాతం వాటా కొన్నారు. కొన్ని రోజుల తర్వాత.. బోర్డులోకి మస్క్​ను ట్విట్టర్​ ఆహ్వానించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. కానీ కొన్నిరోజుల్లోనే మనసు మార్చుకుని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ట్విట్టర్​ మొత్తాన్నే కొనేందుకు ఆఫర్​ ఇచ్చారు.

'ప్రస్తుతం మస్క్​ సంపద 240బిలియన్​ డాలర్లు. డీల్​ వద్దు అనుకుంటే.. బ్రేకప్​ ఫీ కింద మస్క్​ 1బిలియన్​ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. డీల్​ను పూర్తిచేసేందుకు రానున్న ఆరు నెలలు మస్క్​కు కష్టమనే చెప్పాలి,' అని కెల్​నర్​ క్యాపిటల్​కు చెందిన పోర్ట్​ఫోలియో మేనేజర్​ క్రిస్​ పుల్​ట్జ్​ వెల్లడించారు.

240బిలియన్​ డాలర్లు ఉన్న వ్యక్తి.. 1బిలియన్​ డాలర్లను వెచ్చించి డీల్​ నుంచి తప్పుకుంటే.. ఆశ్చర్యం ఏమీ ఉండదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్​ డీల్​ కన్నా బ్రేకప్​ ఫీజు చాలా తక్కువ అని గుర్తుచేస్తున్నారు.

ట్విట్టర్​- టెస్లా షేర్లు..

ఈ వ్యవహారంతో ట్విట్టర్​ షేర్లు బుధవారం ట్రేడింగ్​ ముగిసే సమయానికి 2.1శాతం మేర పతనమయ్యాయి. ప్రస్తుతం 48.68 డాలర్ల వద్ద ట్విట్టర్​ షేరు ఉంది.

మరోవైపు టెస్లా షేర్లను మస్క్​ అమ్ముతారేమో అన్న ఊహాగానాలతో.. టెస్లా షేర్లు మంగళవారం 12శాతం మేర పతనమయ్యాయి. ఫలితంగా 126బిలియన్​ డాలర్ల వాల్యూ ఆవిరైంది.

టాపిక్