Elon Musk - Twitter : ఎలాన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్.. కుదిరిన డీల్-twitter confirms sale of company to elon musk for usd 44 billion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /   Elon Musk - Twitter : ఎలాన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్.. కుదిరిన డీల్

Elon Musk - Twitter : ఎలాన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్.. కుదిరిన డీల్

HT Telugu Desk HT Telugu
Apr 26, 2022 07:23 AM IST

ట్విట్టర్ కొనుగోలుపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ డీల్ ఒకే అయింది. ఈ మేరకు ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు మస్క్.

<p>'ట్విట్టర్​'ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్</p>
<p>'ట్విట్టర్​'ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్</p> (ANI)

గత కొద్దిరోజులుగా ట్విటర్ ను ఎలా మస్క్ కొనుగోలు చేస్తున్నారనే వార్తలపై క్లారిటీ వచ్చేంది. సోషల్ మీడియా నెట్ వర్క్ లో మోస్ట్ పాపులర్ అయిన ట్విట్టర్.. కొద్దిరోజుల్లోనే మస్క్ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మస్క్ ప్రతిపాదనలకు ట్విట్టర్ బోర్డు అంగీకారం తెలిపింది. 44 బిలియన్లుకు డీల్ కుదిరినట్లు ప్రకటన వెలువడింది. కాగా ట్విట్టర్ -ఎలాన్ మస్క్ మధ్య ఈ క్యాష్ డీల్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ డీల్ లో భాగంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‍కు 54.2 డాలర్లను చెల్లించనున్నారు. ట్విట్టర్‌లో తనకు 9.2 శాతం వాటా ఉందని మస్క్ ప్రకటించినప్పుడు ఉన్న ట్విట్టర్ షేర్ ధర కంటే ఇది 36శాతం అధికం. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు మస్క్. తాజాగా కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది.

ట్విట్టర్ తన ఆఫర్‌ను అంగీకరించాక ఎలాన్ మస్క్ ఓ ప్రకటన చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి… భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో అది చాలా ముఖ్యమని, భవిష్యత్తులో దీని ప్రాధాన్యత చాలా ఉంటుందని మస్క్ రాసుకొచ్చారు. 

పరాగ్ అగర్వాల్ ట్వీట్..

ట్విట్టర్‌ కు అపారమైన శక్తి ఉందని, కంపెనీతో కలిసి పని చేసేందుకు ముందుంటానని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ అన్నారు. ట్విట్టర్ తో ఎంతో ప్రయోజనం ఉందని.. దీనికి చాలా ఔచిత్యం ఉందన్న ఆయన.. ఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తమ టీమ్ స‌భ్యుల‌ ప‌ట్ల‌ చాలా గర్వంగా ఉందన్నారు.

కొద్దిరోజులుగా విమర్శలు..

గత కొంతకాలంగా.. ట్విట్టర్​పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్​. ట్విట్టర్​లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్​తో ట్విట్టర్​ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్​ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్​ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్​కు షాక్​ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్​ను ముందుకు తీసుకురావటం.. తాజాగా డీల్ ఓకే కావటం చకచకగా జరిగిపోయాయి.

 

టాపిక్