తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్విట్టర్​ తర్వాత.. ఎలాన్​ మస్క్​ నెక్స్ట్​ టార్గెట్​ 'కోకా కోలా'?

ట్విట్టర్​ తర్వాత.. ఎలాన్​ మస్క్​ నెక్స్ట్​ టార్గెట్​ 'కోకా కోలా'?

HT Telugu Desk HT Telugu

28 April 2022, 8:36 IST

    • అపరకుబేరుడు ఎలాన్​ మస్క్​.. ‘కోకా కోలా’ను కొనుగోలు చేస్తానని ట్వీట్​ చేశారు. ఇటీవలే ట్విట్టర్​ను దక్కించుకున్న ఆయన.. ఇలాంటి ట్వీట్​ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (REUTERS/file)

ఎలాన్​ మస్క్​

Elon Musk Coca Cola | ట్విట్టర్​ను దక్కించుకున్న 48 గంటల అనంతరం.. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ మరో ఆసక్తికర ట్వీట్​ చేశారు. తన నెక్స్ట్​ టార్గెట్​ 'కోకా కోలా' అని వెల్లడించారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

"తర్వాత కోకా కోలాను కొనుగోలు చేస్తాను. అందులో తిరిగి కొకైన్​ను వేస్తాను," అని మస్క్​ ట్వీట్​ చేశారు.

మరి ఇది ఫన్​ కోసం ట్వీట్​ చేశారో, లేక నిజంగానే కోకా కోలాను కొనుగోలు చేసే ఉద్దేశం ఉందా? అనేది ఎలాన్​ మస్క్​ ఒక్కరికే తెలుస్తుంది. కాగా.. 'మెక్​డీని కూడా కొనుక్కుని, అందులోని ఐస్​క్రీమ్​ మెషిన్​ను బాగుచేస్తాను,' అని కూడా మస్క్​ పేర్కొన్నారు.

ట్విట్టర్​లో ఎలాన్​ మస్క్​ చురుకుగా ఉంటారు. ఆయనకు వచ్చిన ఆలోచనలను అందులో పంచుకుంటారు. కొన్నికొన్ని సార్లు ఆయన ట్వీట్లపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటాయి.

ట్విట్టర్​ మస్క్​ సొంతం..

Elon musk twitter | గత కొంతకాలంగా.. ట్విట్టర్​పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్​. ట్విట్టర్​లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్​తో ట్విట్టర్​ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్​ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్​ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్​కు షాక్​ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్​ను ముందుకు తీసుకొచ్చారు. ఆ ఆఫర్​ను ట్విట్టర్​ కాదనలేకపోయింది. ఫలితంగా ఇరువురి మధ్య 44 బిలియన్​ డాలర్ల డీల్​ కుదిరింది. ట్విట్టర్​.. ఎలాన్​ మస్క్​ వశమైంది.

టాపిక్

తదుపరి వ్యాసం