తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | నడిరోడ్డు మీద మహిళను చాచిపెట్టి కొట్టిన డెలివరీ బాయ్​.. అదే కారణం!

Viral | నడిరోడ్డు మీద మహిళను చాచిపెట్టి కొట్టిన డెలివరీ బాయ్​.. అదే కారణం!

HT Telugu Desk HT Telugu

01 April 2022, 15:41 IST

google News
    • ఓ గొడవను ఆపేందుకు వెళ్లి మహిళ చేతిలో దెబ్బలు తిన్నాడో వ్యక్తి. ఇక గొడవను ఆపడం పక్కనపెట్టి.. ఆ మహిళను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
వైరల్​ వీడియో
వైరల్​ వీడియో (TWITTER)

వైరల్​ వీడియో

Delivery boy thrashes woman | ఎవరైనా గొడవ పడుతుంటే.. వారిని అదుపు చేయడం ఒంకింత కష్టమే. కొన్నికొన్నిసార్లు.. ఆ గొడవను అదుపుచేసేందుకు వెళ్లిన వారిపైనా అక్షింతలు పడుతుంటాయి. ఒడిశాలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేమికుల గొడవ మధ్యలోకి వెళ్లాడు ఓ ఫుడ్​ డెలివరీ బాయ్​. చివరికి..

ప్రియుడు మోసం చేస్తున్నాడని..

మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్​లో జరిగింది. ఓ మహిళ.. నడిరోడ్డు మీద తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. అతడిపై గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి ముఖం మీద కొట్టింది. ప్రేమికుల మధ్య గొడవను స్థానికులు చూస్తూ ఉండిపోయారు. కొందరు వీడియోలు తీశారు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళ.. వారి ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించింది.

అయితే.. తన బాయ్​ఫ్రెండ్​ తనని మోసం చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడని, అందుకే అతడిని కొడుతున్నట్టు గట్టిగా అరిచింది. ఈ దృశ్యాలను ప్రజలందరు చూస్తూ ఉండిపోయారు.

Viral video | కొద్దిసేపటికి ఓ స్విగ్గీ డెలివరీ బాయ్​.. అదే రోడ్డు మీద వెళ్లాడు. ప్రియుడుని మహిళ కొట్టడం చూసి.. పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించాడు. కానీ మరో వ్యక్తి తమ మధ్య దూరడంతో ఆ మహిళకు కోపం మరింత పెరిగింది. బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అలా తిట్టొద్దని, వెళ్లిపోవాలని డెలివరీ బాయ్​ అభ్యర్థించినట్టు సమాచారం. కానీ ఆ మహిళ వినలేదు. ఫలితంగా వారిద్దరికి గొడవ మొదలైంది. చివరికి ఆ మహిళ.. ఆ డెలివరీ బాయ్​ చెంప చెళ్లుమనిపించేలా కొట్టింది.

ఇక అప్పటివరకు ప్రశాంతంగా మాట్లాడిన డెలివరీ బాయ్​కు ఒక్కసారిగా పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే నడిరోడ్డు మీద ఆ మహిళను కొట్టడం మొదలపెట్టాడు. ముఖం, శరీరం మీద దాడి చేశాడు. కొద్దిసేపటికి స్థానికులు వారిని అదుపు చేసి, వేరు చేశారు.

స్థానికులు ఈ దృశ్యాలను తమ ఫొన్​లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

కాగా.. ఈ ఘటనపై మహిళ, ఆమె ప్రియుడు, డెలివరీ బాయ్​.. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

టాపిక్

తదుపరి వ్యాసం