తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | భార్యను చూడాలని.. 2000కి.మీల 'పడవ ప్రయాణం'

Viral | భార్యను చూడాలని.. 2000కి.మీల 'పడవ ప్రయాణం'

HT Telugu Desk HT Telugu

26 March 2022, 15:22 IST

google News
    • పెళ్లాం ఊరెళితే సంబరాలు చేసుకుని భర్తలు చాలా మందే ఉంటారు. కానీ తన భార్యను చూసి రెండేళ్లు గడిచిపోయేసరికి.. ఈ వ్యక్తి మైండ్​ పనిచేయలేదు! వెంటనే చూడాలి అనిపించేసింది. ఇక ఆలస్యం చేయకుండా.. ఓ పడవ కొన్నాడు. బంగాళాఖాతంలో 2వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని మొదలుపెట్టేశాడు. చివరికి ఏమైందంటే..
హూంగ్​ హంగ్​
హూంగ్​ హంగ్​

హూంగ్​ హంగ్​

Boat journey to see wife | ప్రేమ.. మనిషిని ఏదైనా చేసేస్తుంది. ప్రేమించిన వారిని చూసేందుకు ఎంతదూరానికైనా వెళ్లాలనిపిస్తుంది. ఓ వియత్నాం వ్యక్తికి కూడా ఇదే అనిపించింది. ఇక ముందు వెనక ఆలోచించలేదు. పడవ కొనుక్కుని.. భార్యను చూసేందుకు 2వేల కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టాడు. చివరికి..

18రోజులు సముద్రంలోనే..

వియత్నాంకు చెందిన హూ హూంగ్​ హంగ్​కు కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లి జరిగింది. ఉద్యోగం రిత్యా ఆమె.. భారత దేశంలోని ముంబైకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఆమె దేశంలోనే ఉండిపోయింది. ఇలా రెండేళ్లు గడిచింది.

భార్యను రెండేళ్లుగా చూడని హూంగ్​.. ఇక అగలేకపోయాడు. వెంటనే ఆమెను కలిసేందుకు బ్యాంకాక్​ నుంచి ఈ నెల 2న బయలుదేరాడు. కానీ ఇండియాకు వచ్చేందుకు అతని వద్ద వీసా లేదు. వీసా లేనిదే విమానంలో అనుమతి ఉండదని తెలుసుకున్న అతను.. ఓ ప్లాన్​ వేశాడు. బ్యాంకాక్​ నుంచి ఫంకెట్​కు బస్సులో వెళ్లాడు. అక్కడే ఓ పడవను కొన్నాడు. అలా.. మార్చ్​ 5న.. బంగాళాఖాతంలో 2000 కిలోమీటర్ల పడవ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.

Ho Hoang Hung | 18 రాత్రులు గడిచిన తర్వాత సిమీలియన్​ దీవుల(థాయ్​లాండ్​ నుంచి 80కిలోమీటర్లు)కు సమీపంలో హూంగ్​ పడవను కొందరు మత్స్యకారులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. చివరికి హూంగ్​ను అధికారులు పడవలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో హూంగ్​ వద్ద ఓ సూట్​కేసు, నీళ్ల సీసా, 10 ప్యాకెట్ల ఇన్​స్టెంట్​ నూడుల్స్​ ఉన్నాయి.

పిచ్చి పీక్స్​కి వెళ్లింది అనాలో లేదో కానీ.. హూంగ్​.. ముందు వెనకా ఆలోచించకుండానే పడవ ఎక్కేశాడు అనే చెప్పాలి. అతని వద్ద బట్టలు లేవు. అంతేకాదు.. జీపీఎస్​ లేనిదే రోడ్డు ప్రయాణాలే కష్టంగా మారిపోయిన రోజులు ఇవి! అలాంటిది పడవ ప్రయాణంలో అతనికి జీపీఎస్​, దిక్సూచిలు కూడా లేవు. 

థాయ్​లాండ్​ అధికారులు వియత్నాం ఎంబసీకి, భారత్​ రాయబార కార్యాలయానికి హుంగ్​ గురించి సమాచారం అందించారు. కానీ ఇంకా ఎలాంటి స్పందన లభించలేదని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత హూంగ్​ను తిరిగి ఫంకెట్​కు పంపిచేస్తామని స్పష్టం చేశారు.

హూంగ్​ కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు తెగ నవ్వేస్తున్నారు. ‘ఎంత ఘాటు ప్రేమయో..’ అని కామెంట్లు పెడుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం