తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video: అయ్యో తండ్రి… భుజాలపై కన్న బిడ్డ మృతదేహాంతో 10కి.మీ కాలినడక..

Viral Video: అయ్యో తండ్రి… భుజాలపై కన్న బిడ్డ మృతదేహాంతో 10కి.మీ కాలినడక..

HT Telugu Desk HT Telugu

26 March 2022, 14:13 IST

google News
    • శవాలను భుజాలపై మోసుకుని వెళ్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి హృదయవిదారక ఘటన తాజాగా ఛత్తీస్ గఢ్ లో వెలుగు చూసింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
భుజాలపై కుమార్తె శవంతో 10 కి.మీ. ప్రయాణం
భుజాలపై కుమార్తె శవంతో 10 కి.మీ. ప్రయాణం

భుజాలపై కుమార్తె శవంతో 10 కి.మీ. ప్రయాణం

ఓ తండ్రికి ఇంతకుమించిన ఘోష రాదేమో..! ఆనారోగ్యంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నకూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.! కానీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో... తండ్రే తన కుమార్తె మృతదేహాన్ని భుజాన వేసుకుని బయల్దేరాడు. అలా 10 కిలో మీటర్లు నడుచుకుంటూ  తన గ్రామానికి వెళ్లాడు. ఈ హృదయవిదారకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. విచారణకు ఆదేశించింది.

ఏం జరిగిందంటే..?

ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ కు ఏడేళ్ల కుమార్తె సురేఖ ఉంది. ఆనారోగ్యం కారణంగా సురేఖను శుక్రవారం సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ చిన్నారి పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ స్థాయులు 60కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం 7.30 గంటలకు పాప ప్రాణాలు కోల్పోయింది.

‘చిన్నారి కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుంది. అవసరమైన చికిత్స అందించాం. అయితే అది కాస్త విషమించింది. ఆక్సిజన్‌ స్థాయులు 60కి పడిపోయాయి. చికిత్స అందించినప్పటికీ చిన్నారి మృతి చెందింది. అంబులెన్స్ వస్తుందని చెప్పామని కానీ ఆలోపే తండ్రి.. బాలికను తీసుకెళ్లిపోయాడు.’ అని డాక్టర్ వినోద్ భార్గవ వెల్లడించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్ దేవ్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బంది వాహనం కోసం వేచి ఉండేలా కుటుంబాన్ని ఒప్పించి ఉండాలి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది అని మంత్రి వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం