తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Debt Mutual Funds: డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ. 92,248 కోట్ల మేర విత్ డ్రా

Debt mutual funds: డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ. 92,248 కోట్ల మేర విత్ డ్రా

12 July 2022, 13:57 IST

    • Debt mutual funds inflows: డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ నెలలో ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకున్నారు.
జూన్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి భారీగా ఔట్ ఫ్లో
జూన్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి భారీగా ఔట్ ఫ్లో (REUTERS)

జూన్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి భారీగా ఔట్ ఫ్లో

న్యూఢిల్లీ, జూలై 12: ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌పై ఫోకస్ చేసే మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ నెలలో భారీగా నిధులు విత్ డ్రా అయ్యాయి. రూ. 92,248 కోట్ల మేర నిధుల ఔట్ ఫ్లో నమోదైంది. వడ్డీ రేట్ల పెరుగుదల, కమాడిటీల ధరల పెరుగుదల, ఆర్థిక వృద్ది నెమ్మదించడం వంటి కారణాల వల్ల సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి పరిస్థితులు ఎదుర్కొంటున్నందున మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధుల ఔట్ ఫ్లో నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) గణాంకాల ప్రకారం మే నెలలో రూ. 32,722 కోట్ల నిధుల ఉపసంహరణ నమోదవగా, ఏప్రిల్‌లో 54,756 కోట్ల మేర నిధుల ఔట్ ఫ్లో ఉంది.

మొత్తం 16 ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ లేదా డెట్ ఫండ్ కేటగిరీల నుంచి 14 కేటగిరీల్లో జూన్ నెలలో భారీగా నిధులు వెనక్కి మళ్లాయి. ఓవర్‌నైట్, లిక్విడ్, అల్ట్రాషార్ట్ టెర్మ్ డ్యురేషన్ ఫండ్స్‌లో భారీగా నిధులు ఉపసంహరణ నమోదైంది.

10 ఏళ్ల గిల్ట్ ఫండ్స్, లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో మాత్రమే నిధుల ఇన్‌ఫ్లో నమోదైంది. వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్భణ రేట్ల పెరుగుదల కారణంగా స్వల్ప కాల వ్యవధి కోసం నిధుల అవసరాల దృష్ట్యా ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించి ఉంటారన్న సంకేతం ఇదని భారతదేశపు తొలి మహిళా ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ ఎల్ఎక్స్ఎంఈ ఫౌండర్ ప్రీతి రాఠీ గుప్తా అభిప్రాయపడ్డారు.

‘వడ్డీ రేట్ల పెంపు, కమాడిటీ ధరల పెరుగుదల, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఏర్పడిన అనిశ్చిత సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు తమ నిధులు ఉపసంహరించుకున్నారు..’ అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ కవితా కృష్ణన్ అన్నారు.

‘సింగిల్ డిజిట్ రిటర్న్స్ ఉండడం, బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండడం, ద్రవ్యోల్భణం పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు తమ నగదు ఉపసంహరించుకుని మరింత లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను ఎంచుకున్నారు..’ అని ఆమె వివరించారు.

డెట్ మ్యూచువల్ ఫండ్స్ అసెట్ బేస్ జూన్ నెలలో రూ. 13.22 లక్షల కోట్ల నుంచి రూ. 12.35 లక్షల కోట్లకు పడిపోయింది.

డెట్ ఫండ్ కేటగిరీలో లిక్విడ్, అల్ట్రాషార్ట్-టెర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్ కేటగిరీలు మొత్తం అసెట్స్‌లో సగం మేర ఉన్నాయి. వీటికి గణనీయమైన వాటా ఉండడం వల్ల స్వల్ప మార్పులు కూడా మొత్తం కేటగిరీపై ప్రభావం చూపుతాయి.

జూన్ నెలలో ఎక్కువగా ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రాషార్ట్-టెర్మ్ డ్యురేషన్ ఫండ్ కేటగిరీల నుంచే నిధుల ఔట్ ఫ్లో కొనసాగింది. వరుసగా రూ. 20,668 కోట్లు, రూ. 15,783 కోట్లు, రూ. 10,058 కోట్ల ఔట్ ఫ్లో కొనసాగింది.

సాధారణంగా డెట్ ఫండ్స్ తక్కువ రిస్కీ అసెట్ క్లాస్ అని, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులు ఇస్తాయని, రిస్క్ లేకుండా తమ సొమ్మును వీటిలో కాపాడుకోవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తారు.

మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ. 15,498 కోట్ల మేర జూన్ నెలలో నిధులను ఆకర్షించాయి. స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరంతరంగా తమ ఈక్విటీలను విక్రయిస్తున్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిధులను ఆకర్షించగలిగాయి.

ఈక్విటీలు వాల్యూ క్రియేటర్ అసెట్ ‌క్లాస్‌గా ఇన్వెస్టర్లు భావిస్తున్నందున వాటిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా లాంగ్ టెర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ నెరవేర్చేందుకు ఇన్వెస్టర్లు వీటిలో పెట్టబడులు పెడుతున్నారు.

మొత్తంగా జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ. 69,853 కోట్ల ఔట్ ఫ్లో ఉంది. మే నెలలో ఔట్ ఫ్లో కేవలం రూ. 7,532 కోట్లుగా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం