తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dawood Ibrahim : అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకున్న అండర్​వరల్డ్​ డాన్​ దావూద్!

Dawood Ibrahim : అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకున్న అండర్​వరల్డ్​ డాన్​ దావూద్!

17 January 2023, 13:25 IST

google News
  • Dawood Ibrahim second marriage : మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్పి.. దావూద్​ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు! ఈ విషయాన్ని అతని మేనల్లుడు అలీషాహ్​.. ఎన్​ఐఏ అధికారులకు చెప్పాడు.

దావూద్​ ఇబ్రహీం
దావూద్​ ఇబ్రహీం (HT_PRINT)

దావూద్​ ఇబ్రహీం

Dawood Ibrahim second marriage : అండర్​వరల్డ్​ డాన్​, మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​ దావూద్​ ఇబ్రహీంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు అతని మేనల్లుడు అలీషాహ్​ పార్కర్​. మొదటి భార్య మైజాబిన్​ ఉండగానే.. మరో మహిళను దావూద్​ పెళ్లిచేసుకున్నట్టు పేర్కొన్నాడు. ఆ మహిళ ఓ పాకిస్థానీ పఠాన్​ కుటుంబానికి చెందినదిగా వివరించాడు.

అబద్ధం చెప్పి.. రెండో పెళ్లి..!

టెర్రర్​ ఫండింగ్​ కేసులో భాగంగా దావూద్​ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేసింది ఎన్​ఐఏ (నేషనల్​ ఇన్​వెస్టిగేషన్​ ఏజెన్సీ). ఈ క్రమంలో దావూద్​తో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్​ చేసింది. వీరిలో దావూద్​ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్​ కుమారుడు అలీషాహ్​ పార్కర్​ కూడా ఉన్నాడు. విచారణలో భాగంగా.. అలీషాహ్​ స్టేట్​మెంట్​ను తీసుకున్న అధికారులు.. టెర్రర్​ ఫండింగ్​ కేసులో ఛార్జ్​షీట్​ను దాఖలు చేశారు.

Underworld don Dawood Ibrahim : విచారణలో.. దావూద్​ ఇబ్రహీంపై పలు కీలక విషయాలను బయటపెట్టాడు అలీషాహ్​ పార్కర్​. దావూద్​ ఇబ్రహీం కుటుంబం గురించి చెప్పాడు. అదే సమయంలో.. పాకిస్థాన్​ కరాచీలోని ఒక ప్రాంతానికి దావూద్​ ఇబ్రహీం రీలొకేట్​ అయినట్టు వివరించాడు.

అలీషాహ్​ పార్కర్​ ప్రకారం.. దావూద్​కు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. మొదటి వివాహం విషయంలో అబద్ధం చెప్పి.. అతను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Dawood Ibrahim Alishah Parkar : "మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్టు దావూద్​ ఇబ్రహీం అందరికి చెప్పాడు. కానీ అది నిజం కాదు. మొదటి భార్యతో ఉండగానే.. అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో దావూద్​ ఇబ్రహీం తన ఇంటిని కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు అతను కరాచీ అబ్దుల్లా ఘాజి బాబా దర్గాకు సమీపంలోని రహీమ్​ ఫకీ అనే డిఫెన్స్​ ప్రాంతంలో నివాసముంటున్నాడు," అని అధికారులకు వివరించాడు అలీషాహ్​ పార్కర్​. అయితే.. దావూద్​ ఇబ్రహీం ఎవరితోనూ మాట్లాడట్లేదని, అందరికీ దూరంగా ఉంటున్నాడని తెలిపాడు.

వాట్సాప్​ కాల్స్​లో..

"నేను 2022లో దుబాయ్​కి వెళ్లాను. జులైలో అక్కడ దావూద్​ మొదటి భార్యను కలిశాము. నా భార్యకు ఆమె పండుగల సమయంలో ఫోన్​లు చేస్తుంది. వాట్సాప్​ కాల్స్​లో వాళిద్దరు తరచూ మాట్లాడుకుంటారు," అని చెప్పాడు దావూద్​ మేనల్లుడు.

Alishah Parkar NIA chargesheet : అలీషాహ్​ పార్కర్​ ప్రకారం.. మొదటి భార్యతో దావూద్​ ఇబ్రహీంకి ముగ్గురు ఆడబిడ్డలు, ఒక కుమారుడు ఉన్నారు. వారు.. మరూఖ్​, మెహ్రిన్​, మజియా, మోహిన్​ నవాజ్​.

భారీ పేలుళ్లకు కుట్ర..!

నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. దావూద్​ ఇబ్రహీం ప్రస్తుతం ఓ పెద్ద టీమ్​ను తయారు చేస్తున్నాడు. దేశంలోని అగ్రనేతలు, బడా వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఈ బృందం దాడులు చేసే అవకాశం ఉంది. ప్రముఖ నగరాల్లో హింసకు పాల్పడి.. అలజడులు సృష్టించే ప్రమాదం ఉంది.

తదుపరి వ్యాసం