NIA files charges against Dawood: దావూద్ సహా ‘డీ’ గ్యాంగ్ పై ఎన్ఐఏ చార్జిషీట్-nia files charges against dawood shakeel aides in terror funding case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nia Files Charges Against Dawood: దావూద్ సహా ‘డీ’ గ్యాంగ్ పై ఎన్ఐఏ చార్జిషీట్

NIA files charges against Dawood: దావూద్ సహా ‘డీ’ గ్యాంగ్ పై ఎన్ఐఏ చార్జిషీట్

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 10:17 PM IST

NIA files charges against Dawood: గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం సహా డీ గ్యాంగ్ లోని పలువురిపై NIA చార్జిషీట్ దాఖలు చేసింది. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడు.

దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)
దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)

NIA files charges against Dawood: అంతర్జాతీయ ఉగ్రవాది, ‘డీ’ గ్యాంగ్ లీటర్, గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం, ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్న చోటా షకీల్ సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు NIA శనివారం వెల్లడించింది.

NIA files charges against Dawood: పాకిస్తాన్ లో ఆశ్రయం..

ముంబై పేలుళ్ల అనంతరం దేశం విడిచి పారిపోయిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందాడు. దావూద్, షకీల్ వీరిద్దరూ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నట్లు భారత్ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లతో పాటు వారి తరఫున ముంబైలో అసాంఘిక కార్యకలాపాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఆరిఫ్ అబుబాకర్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్, షబ్బీర్ అబూబాకర్ షేక్, మొహమ్మద్ సలీమ్ ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్ లపై NIA చార్జి షీటు పెట్టింది. వారిపై ఐపీసీతో పాటు, UAPA, MCOCA లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

NIA files charges against Dawood: ముంబైలో అరాచకం

దావూద్ గ్యాంగ్ అలియాస్ డీ కంపెనీ ముంబై కేంద్రంగా చేయని అరాచకం లేదు. హత్యలు, బెదిరింపు వసూళ్లు, డ్రగ్స్ దందాతో పాటు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు నిధులను అందజేసేవారు. వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ గా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు. చార్జిషీట్ లో పేర్కొన్న వారిలో ఆరిఫ్ అబుబాకర్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్, షబ్బీర్ అబూబాకర్ షేక్, మొహమ్మద్ సలీమ్ ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్ లను NIA అరెస్ట్ చేసింది.

NIA files charges against Dawood: అంతర్జాతీయ ఉగ్రవాది

దావూద్ ఇబ్రహీం 1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు. దావూద్ కు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇచ్చినవారికి ఐక్యరాజ్య సమితి భద్రతామండలి 2003లో 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. NIA కూడా రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది.

Whats_app_banner

టాపిక్