తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg Results 2023 : సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి..

CUET PG results 2023 : సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

21 July 2023, 6:15 IST

google News
  • CUET PG results 2023 : సీయూఈటీ పీజీ 2023 పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదల..
సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదల..

సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదల..

CUET PG results 2023 : కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ (సీయూఈటీ)- పీజీ 2023 ఫలితాలను ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) విడుదల చేసింది. దేశంలోని 190కిపైగా యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను, అభ్యర్థులు.. cuet.nta.nic.in వెబ్​సైట్​లో చెక్​ చేసుకోవచ్చు.

"అభ్యర్థుల ఫలితాలను వర్సిటీలకు కూడా షేర్​ చేశాము. తదుపరి ప్రక్రియ కోసం సంబంధిత యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో అభ్యర్థులు టచ్​లో ఉండాలి," అని ఎన్​టీఏ సీనియర్​ డైరక్టర్​ సాధన పరాషర్​ తెలిపారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

"సీయూఈటీ పీజీ 2023కి సంబంధించిన మెరిట్​ లిస్ట్​ను యూనివర్సిటీలు తయారు చేస్తాయి. స్కోర్​ కార్డు ఆధారంగా కౌన్సిలింగ్​ ఉంటుంది," అని సాధన స్పష్టం చేశారు

ఇదీ చూడండి:- CUET UG 2023 results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల

స్కోర్​ కార్డు డౌన్​లోడ్​ చేసుకోండిలా..

స్టెప్​ 1:- సీయూఈటీ పీజీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- లాగిన్​ వివరాలు ఇచ్చి, సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 3:- స్క్రీన్​పై మీ ఫలితాలు కనిపిస్తాయి.

స్టెప్​ 4:- ఫలితాలను చెక్​ చేసుకుని సంబంధిత పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకోండి.

"రిజిస్ట్రేషన్లు, పరీక్ష నిర్వహణ, ఆన్సర్​ కీని తయారు చేయడం, తుది కీని వెల్లడించడం, ఫలితాలను ప్రకటించడం మాత్రమే ఎన్​టీఏ పని. అడ్మిషన్ల ప్రక్రియ సంబంధిత వర్సిటీలు చూసుకుంటాయి," అని సాధన స్పష్టం చేశారు.

సీయూఈటీ పీజీ 2023 పరీక్ష ఈ ఏడాది జూన్​ 5 నుంచి 17 మధ్యలో జరిగింది. కొన్ని సెంటర్లలో రీ ఎగ్జామినేషన్​ కూడా జరిగింది. కాగా.. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. సరైన సమాధానికి అభ్యర్థులకు 4 మార్కులు వస్తాయి. తప్పు అయితే 1 మార్క్​ పోతుంది. ఆన్సర్​ చేయని ప్రశ్నలకు మార్కులు ఉండవు.

తదుపరి వ్యాసం