AP EdCET Results : ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల - లింక్ ఇదే
15 July 2023, 6:48 IST
- AP EdCET Results 2023: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఈ రిజల్ట్స్ ను https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా పొందవచ్చు.
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు 2023
AP EDCET Results 2023: ఎడ్ సెట్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. శుక్రవారం ఏపీ ఎడ్ సెట్ - 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. జూన్ 14న జరిన ఎడ్‌సెట్ పరీక్ష 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,236 హాజరయ్యారు. వీరిలో 10,908 (97.08%) మంది ఉత్తీర్ణత సాధించనట్లు ప్రకటించారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి....
అభ్యర్థులు మొదటాగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్, ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
వ్యూ రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.
ఇక ఈ ఏడాది ఫలితాల్లో మ్యాథమెటిక్స్ విభాగంలో సాగర్ టాపర్ గా నిలిచారు. ఫిజికల్ సైన్స్ విభాగంలో తిరుపతి నాయుడు, బయోలాజికల్ సైన్స్ విభాగంలో లల్మట్టి ఆశం మొదటి ర్యాంక్ సాధించారు. సోషల్ స్టడీస్ విభాగంలో బలరామ నాయుడు, ఇంగ్లీష్ విభాగంలో నవీన్ కు ఫస్ట్ ర్యాంకులు దక్కాయి.