CUET UG 2023 results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల
CUET UG results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

CUET UG results : సీయూఈటీ యూజీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్- అండర్గ్రాడ్జ్యుయేట్) 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 22వేలకుపైగా మంది అభ్యర్థులు 100 పర్సెంటైల్‌ను స్కోర్ చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను cuet.samarth.ac.in లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశంలోని వివిధ కేంద్ర వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీల్లో ఎంట్రీ కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. కాగా ఈసారి ఇంగ్లీష్, బయోలజీ, ఎకనామిక్స్‌లో టాప్ స్కోర్లు నమోదయ్యాయి. మొత్తం మీద 11.11 లక్షల మంది విద్యార్థులు ఈ దఫా పరీక్షలను రాశారు. వీరిలో 5,685 మందికి ఇంగ్లీష్‌లో 100 పర్సెంటైల్ వచ్చింది. 4,850మందికి బయోలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో టాప్ స్కోర్ వచ్చింది. ఇక ఎకనామిక్స్‌లో 2,836మంది టాప్ స్కోర్ సాధించారు.
"ఈక్వి-పర్సెంటైల్ మెథడ్ ఆధారంగా ప్రతి ఒక్కరి ప్రదర్శనను ఇవాల్యుయేట్ చేశాము. కాగా.. నార్మలైజ్డ్ మార్కులను పర్సెంటైల్ ఆధారంగా రూపొందించాము. అభ్యర్థుల రిజిస్ట్రేషన్, పరీక్ష నిర్వహణ, ఆన్సర్ కీ విడుదల, ఫైనల్ ఆన్సర్ కీ ప్రకటన, ఫలితాలు విడుదల బాధ్యత మాది. కానీ మెరిటల్ లిస్ట్‌ను సంబంధిత వర్సిటీలే రూపొందిస్తాయి," అని ఎన్టీఏ వెల్లడించింది.
రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- ముందుగా అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2:- హోం పేజీపై కనిపించే "CUET UG 2023 result" లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3:- పుట్టిన రోజు, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేసి, లాగిన్ కావాలి.
స్టెప్ 4:- స్క్రీన్ పై ఫలితాల లిస్ట్ కనిపిస్తుంది.
స్టెప్ 5:- విద్యార్థి తన రిజల్ట్‌ను చెక్ చేసుకుని, ఆ రిజల్ట్ పేజీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఏంటి..?
CUET UG 2023 results live updates : అప్లికేషన్ల పరంగా.. దేశంలో రెండో అతిపెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్‌గా నిలిచింది ఈ సీయూఈటీ- యూజీ. గతేడాది జరిగిన తొలి ఎడిషన్‌లో 12.5లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేషనల్ ఎడ్జ్యుకేషన్ పాలసీ ఆధారంగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూజీతో పాటు పీజీ(పోస్ట్ గ్రాడ్జ్యుయేషన్)కు వేరువేరుగా ఎగ్జామ్ ఏర్పాటు చేస్తారు. ఈసారి మే- జూన్ మధ్యలో వివిధ సెషన్స్‌లో పరీక్ష జరిగింది.
ఇక పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత.. ఎంపికైన అభ్యర్థులు వర్సిటీల్లో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియలో అనేక యూనివర్సిటీలు ఈ సీయూఈటీ యూజీ పరీక్ష ఫలితాలను ప్రధానంగా చూస్తున్నాయి.
సంబంధిత కథనం