తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg Admit Card : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

CUET PG Admit Card : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

03 June 2023, 11:14 IST

    • CUET PG Admit Card 2023 : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ను ఎన్​టీఏ విడుదల చేసింది. ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి
సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

CUET PG Admit Card : 2023 సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ను విడుదల చేసింది ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ పోస్ట్​ గ్రాడ్జ్యువేషన్​ పరీక్ష కోసం హాజరవుతున్న అభ్యర్థులు తమ అడ్మిట్​ కార్డ్​లను cuet.nta.nic.in లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఈ సీయూఈటీ పీజీ పరీక్షలను జూన్​ 5 నుంచి జులై 17 వరకు నిర్వహిస్తుంది ఎన్​టీఏ. ఇదొక కంప్యూటర్​ ఆధారిత పరీక్ష. మూడు షిఫ్ట్​లలో (ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 వరకు) పరీక్షలు జరుగుతాయి. 2023 జూన్​ 5 నుంచి జూన్​ 8 వరకు జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్​ కార్డ్​లు తాజాగా విడుదలయ్యాయి. డైరక్ట్​ డౌన్​లోడ్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ను డౌన్​లోడ్​ చేసుకోవడం ఎలా..

స్టెప్​ 1:- ముందుగా సీయూఈటీ పీజీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డ్​ 2023 లింక్​ ఉంటుంది. దానిపై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- మీ లాగిన్​ వివరాలు ఎంటర్​ చేసి, సబ్మీట్​ బటన్​ ప్రెస్​ చేయండి.

స్టెప్​ 4:- స్క్రీన్​పై మీ అడ్మిట్​ కార్డ్​ కనిపిస్తుంది.

స్టెప్​ 5:- అడ్మిట్​ కార్డ్​ వివరాలు చెక్​ చేసుకుని డౌన్​లోడ్​ చేసుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్​సైట్​ను చూడాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం