తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cowin Data Leak : భారతీయుల ఆధార్​, పాన్​ డేటా లీక్​.. 'కోవిన్​' వల్లే..!

CoWIN data leak : భారతీయుల ఆధార్​, పాన్​ డేటా లీక్​.. 'కోవిన్​' వల్లే..!

Sharath Chitturi HT Telugu

12 June 2023, 12:28 IST

  • CoWIN data leak : ప్రముఖ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్​లో.. భారతీయుల ఆధార్​, పాన్​ కార్డు డేటా లీకైనట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిన్​ పోర్టల్​ ద్వారా ఈ డేటా లీక్​ జరిగినట్టు వివరించింది.

భారతీయుల ఆధార్​, పాన్​ డేటా లీక్​.. కోవిన్​ వల్లే..!
భారతీయుల ఆధార్​, పాన్​ డేటా లీక్​.. కోవిన్​ వల్లే..! (HT_PRINT)

భారతీయుల ఆధార్​, పాన్​ డేటా లీక్​.. కోవిన్​ వల్లే..!

CoWIN data leak : ఇండియాలో మరో డేటా బ్రీచ్​ ఘటన! భారతీయుల ఆధార్​ కార్డు, పాన్​ కార్డు వివరాలు టెలిగ్రామ్​లో లీకైనట్టు ఓ నివేదిక పేర్కొంది. పలు మీడియా కథనాల ప్రకారం.. కోవిన్​ పోర్టల్​ ద్వారా ఈ డేటా బయటకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

డేటా లీక్​తో ముప్పు తప్పదా..!

కొవిడ్​పై పోరులో కోవిన్​ పోర్టల్​ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టీకా తీసుకున్న భారతీయులు.. ఈ పోర్టల్​లో రిజిస్టర్​ చేసుకున్నారు. చాలా కీలకమైన వివరాలను కోవిన్​లో పొందుపరిచారు. ఇక ఇప్పుడు.. నివేదిక ప్రకారం.. కోవిన్​ పోర్టల్​లో రిజిస్టర్​ అయిన నెంబర్​ను ఎంటర్​ చేసినప్పుడు.. టీకా కోసం సంబంధిత వ్యక్తి ఉపయోగించిన ఐడీ కార్డు, జెండర్​, పుట్టిన తేదీ వివరాలు, టీకా తీసుకున్న వ్యాక్సినేషన్​ సెంటర్​తో పాటు ఎన్ని డోసులు తీసుకున్నారు? వంటి వివరాలను టెలిగ్రామ్​ బాట్​ చెబుతోంది!

Aadhaar data leak : తాజా లీక్​లో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ కూడా బాధితుడిగా మారారు! భూషణ్​ నెంబర్​ ఎంటర్​ చేసినప్పుడు.. ఆధార్​ కార్డు చివరి నాలుగు అక్షరాలు, పుట్టిన తేదీ వివరాలతో పాటు ఇతర డేటా కనిపించిందని నివేదిక తెలిపింది. ఆయన సతీమణి, ఉత్తరాఖండ్​ ఎమ్మెల్యే రీతు ఖండూరి వివరాలు కూడా బయటకొచ్చినట్టు పేర్కొంది.

అయితే ఈ వార్త నిజమా కాదా అన్న విషయాన్ని హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ధృవీకరించలేకపోయింది. కానీ ఇదే నిజమైతే.. కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలన్నీ.. టెలిగ్రామ్​లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు అవుతుంది. డేటాని ఆయుధంగా వాడుకుంటున్న సైబర్​ నేరగాళ్లు.. మరిన్ని అక్రమాలకు పాల్పడేందుకు వీటిని ఉపయోగించుకునే ప్రమాదం ఉంటుంది.

తాజా డేటా లీక్​ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Pan card data leak : 2021లోనూ ఇదే తరహా వార్తలు బయటకొచ్చాయి. కోవిన్​ పోర్టల్​ హ్యాక్​ అయ్యిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఫలితంగా 15కోట్లకుపైగా మంది భారతీయుల డేటా లీక్​ అయినట్టు వెల్లడించాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సైబర్​ సెక్యూరిటీ రీసెర్చర్లు కొట్టిపారేశారు.

తదుపరి వ్యాసం