తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Jn1 Cases In India : అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?

Covid JN1 cases in India : అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?

Sharath Chitturi HT Telugu

26 December 2023, 13:05 IST

  • Covid JN1 cases in India : న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవా ప్లాన్​ వేస్తున్న వారికి అలర్ట్​. అక్కడ కొవిడ్​ కొత్త సబ్​ వేరియంట్​ జేఎన్​.1 కేసులు అత్యధికంగా ఉన్నాయి!

అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?
అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?

అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?

Covid JN1 cases in India : న్యూ ఇయర్​ వేడుకల కోసం దేశం సన్నద్ధమవుతున్న సమయంలోనే కొవిడ్​ కొత్త సబ్​వేరియంట్​ జేఎన్​.1 కేసులు పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ సబ్​ వేరియంట్​ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్​.1 సబ్​ వేరియంట్​ కేసులు ఉండగా, వాటిల్లో 34.. గోవాలోనే రికార్డ్​ అయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 1 కేసు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

కొవిడ్​ సబ్​వేరియంట్​​ జేఎన్​.1పై నివేదిక ప్రకారం..

దేశంలో యాక్టివ్​ కొవిడ్​ కేసుల సంఖ్య 4,054గా ఉంది. వీటిల్లో.. కేరళోలనే అత్యధిక యాక్టివ్​ కేసులున్నాయి.

"కొవిడ్​ పరీక్షలను పెంచాము. రోజుకు 3 నుంచి 4 కేసులే వస్తున్నాయి. 1శాతం కన్నా తక్కువే ఇవి. జేఎన్​.1 కొవిడ్​ వేరియంట్​ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మాక్​ డ్రిల్స్​ నిర్వహించాము. అన్ని చర్యలు తీసుకున్నాము," అని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్​ భరద్వాజ్​ తెలిపారు.

Covid cases in India Today : తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులిటెన్​ ప్రకారం.. రాష్ట్రంలో 989 సాంపిల్స్​ని పరీక్షించగా వాటిల్లో 10 పాజిటివ్​ కేసులు వెలుగులోకి వచ్చింది. 8,40,392మంది కొవిడ్​ రోగులు రికవర్​ అయ్యారు.

మహారాష్ట్ర పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ డేటా ప్రకారం.. ఆ రాష్ట్రంలో సోమవారం 28 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 153కి పెరిగింది. రాష్ట్రంలో ఒమిక్రాన్​ ఎక్స్​బీబీ.1.16 వేరియంట్​ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. 1972 కేసులు ఈ వేరియంట్​కి చెందినవే! 19మంది ప్రాణాలు కోల్పోయారు.

గత వేరియంట్లతో పోల్చుకుంటే కొవిడ్​ కొత్త వేరియంట్​ జేఎన్​.1 అంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. రోగుల్లో కూడా స్వల్ప సమస్యలను మాత్రమే సృష్టిస్తోంది.

Covid JN1 cases latest news : కర్ణాటకలో 125 కొవిడ్​ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 436గా ఉంది.

జేఎన్​.1 తో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​ అభిప్రాయపడ్డారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం బెటర్​ అని అన్నారు.

తదుపరి వ్యాసం