తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress Pledges To Scrap Agnipath : 'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Congress pledges to scrap Agnipath : 'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Sharath Chitturi HT Telugu

26 February 2024, 16:22 IST

google News
  • Congress on Agnipath scheme : లోక్​సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఆర్మీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ.. అగ్నిపథ్​ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. దాని స్థానంలో పాత ప్రక్రియను తీసుకొస్తామని వెల్లడించింది.

'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'
'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

'అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము'

Agnipath scheme Congress : 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వస్తే.. వివాదాస్పద 'అగ్నిపథ్​' పథకాన్ని తొలగిస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఆర్మీ సేవల రిక్రూట్​మెంట్​ కోసం.. అగ్నిపథ్​ స్థానంలో పాత సిస్టెమ్​ని తిరిగి ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. అగ్నిపథ్​పై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్​ ఈ ప్రకటన చేసింది.

ఆర్మీ రిక్రూట్​మెంట్​ కోసం కేంద్రం.. 2022లో ఈ అగ్నిపథ్​ స్కీమ్​ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. సర్వీస్​ టెన్యూర్ (4ఏళ్ల కాంట్రాక్ట్​)​ తగ్గిపోతుంది, బెనిఫిట్స్​ కూడా తక్కువగానే అందుతాయి. ఈ స్కీమ్​ చుట్టూ చాలా వివాదం నడిచింది. చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా.. ఈ విషయాలను ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు మల్లిఖార్జున ఖర్గే. 2లక్షల మంది పురుషులు, మహిళలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఆర్మీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియతో యువత భవిష్యత్తు అంధకారంలోకి జారుకుందని అన్నారు.

Agnipath scheme BJP : ఖర్గే లేఖ రాసిన వార్త బయటకు వచ్చిన కొన్ని గంటలకు.. కాంగ్రెస్​ నేతలు సచిన్​ పైలట్​, దీపక్​ హుడాలు మీడియా సమావేశం నిర్వహించారు.

"డిఫెన్స్​ పరంగా మన ఖర్చులు పెరుగుతున్నాయి. డిఫెన్స్​ ఎగుమతుల ద్వారా మన సంపద పెరుగుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. దేశీయంగా మేన్యుఫ్యాక్చరింగ్​ చేసి మనం ఇండిపెండెంట్​గా అవుతున్నామని వార్తలు వస్తున్నాయి. మన రక్షణ శాఖ ఇంత ఆదాయం జనరేట్​ చేస్తూ, మన సామర్థ్యం భారీ స్థాయిలో పెరుగుతుంటే.. జాబ్స్​, రిక్రూట్​మెంట్​, వీర సైనికుల కుటుంబాల కోసం వనరులు కేటాయించాలి కదా," అని సచిన్​ పైలట్​ అన్నారు.

"బీజేపీ ప్రభుత్వం..సైన్యాన్ని బలహీపరుస్తోంది. కాస్ట్​ కటింగ్​ అంటూ.. రాజకీయాలు చేస్తోంది. అందుకే అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీ-20 సదస్సుపై ప్రభుత్వం రూ. 4,100 కోట్లు వెచ్చించింది. ప్రధాని విమానంపై రూ. 4,800 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​పై రూ. 20వేలు, యాడ్స్​పై మరో రూ. 6500 కోట్లు వెచ్చించింది. కానీ అత్యంత కీలకమైన భారత దేశ భద్రత, సైనికుల రిక్రూట్​మెంట్​లో డబ్బులు పొదుపు చేయాలని చూస్తోంది," అని పైలట్​ మండిపడ్డారు.

Army recruitment process Agnipath scheme : "అగ్నిపథ్​ స్కీమ్​ తీసుకురావాలని.. ఆర్మీ, సైనికులు, యువత, రాజకీయ పార్టీల నుంచి డిమాండే లేదు. అగ్నివీర్​ వచ్చిన తర్వాత.. ఆర్మీ రిక్రూట్​మెంట్​ సగటు.. యేటా 60,000-65,000 నుంచి 45వేలకు పడిపోయింది. ఇదే కొనసాగితే.. 10ఏళ్లల్లో.. 1.4 మిలియన్​ శక్తి ఉన్న మన సైన్యం.. 8,00,000కు పడిపోతుంది. 'వన్​ నేషన్​, వన్​ ర్యాంక్​, వన్​ పెన్షన్​' అంటూ ఎన్నికల్లో చేసిన హామీని నెరవేర్చకుండా.. ఈ ప్రభుత్వం 'నో ర్యాంక్​, నో పెన్షన్​ సిస్టెమ్​'ని తీసుకొచ్చింది," అని హుడా ఆరోపించారు.

'సైనికుడు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వెళతాడు. అతనికి పెన్షన్​ కూడా ఉండదు! ఏం చేస్తాడు? ఎక్కడికి వెళతాడు? బీజేపీ నేత విజయ్​వర్ఘియ మాత్రం.. నాలుగేళ్ల తర్వాత.. తమ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు ఇస్తామని అంటున్నారు,' అని అసహనం వ్యక్తం చేశారు హుడా.

తదుపరి వ్యాసం