అగ్నివీర్స్ (Army Agniveer Recruitment 2024) తదుపరి రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఇండియన్ ఆర్మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 8న ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 కు సంబంధించిన దరఖాస్తు ఫారాలు joinindianarmy.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన రాత పరీక్ష ఈ ఏప్రిల్ నెలలో ఉంటుంది. ఆ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్ లకు పిలుస్తారు.
ఈ ఆర్మీ అగ్నివీర్ (Army Agniveer Recruitment 2024) రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్ మెన్ పోస్టులకు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అప్లై చేయడానికి ముందు ఈ కింద పేర్కొన్న వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అవి, 10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్. ఆ మెట్రిక్ సర్టిఫికేట్ లోని వివరాల ప్రకారం ఈ క్రింది వివరాలను ఖచ్చితంగా నింపాలి: పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ. అలాగే, అభ్యర్థికి చెందిన చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను కూడా పొందుపర్చాలి.
అభ్యర్థి తన మొబైల్ నంబర్ ను కూడా అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేయాలి. పూర్తి చిరునామా వివరాలను తెలియజేయాలి. దాంతో పాటు, స్కాన్ చేసిన పాస్ పోర్ట్ సైజు ఫోటో ను అప్ లోడ్ చేయాలి. ఆ స్కాన్డ్ ఫోటో సైజ్ 10 కేబీ నుంచి 20 కేబీ మధ్య, .jpg ఫార్మాట్ లో ఉండాలి. అలాగే, స్కాన్ చేసిన సంతకం ఫోటో ను కూడా అప్ లోడ్ చేయాలి. ఈ సంతకం స్కాన్డ్ కాపీ సైజ్5 Kb నుంచి 10 Kb మధ్య, .jpg ఫార్మాట్ లో ఉండాలి. అభ్యర్థి తన 10వ తరగతి పూర్తి వివరణాత్మక మార్క్ షీట్, ఇతర ఉన్నత విద్యార్హతలు, దరఖాస్తు చేస్తున్న కేటగిరీ/ఎంట్రీ యొక్క అర్హత ప్రమాణాల ప్రకారం అప్లికేషన్ ఫారంలో నింపాల్సి ఉంటుంది.