తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Earthquake Today : చైనాలో భారీ భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు!

China Earthquake today : చైనాలో భారీ భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు!

Sharath Chitturi HT Telugu

23 January 2024, 6:40 IST

  • China Earthquake today : చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ ప్రకంపనలు దిల్లీని తాకాయి!

చైనాలో  భారీ భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు!
చైనాలో భారీ భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు!

చైనాలో భారీ భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు!

China earthquake today : భారీ భూకంపంతో చైనా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్థాన్​- జిన్జియాంగ్​ సరిహద్దు ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడినట్టు తెలుస్తోంది. అనేక భవనాలు నేలమట్టమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. చైనాలో భూకంపం ధాటికి.. దిల్లీలో ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.

చైనాలో భారీ భూకంపం..

చైనాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు.. భూకంపం సంభవించింది. 4 గంటల నాటికి.. అంటే కేవలం 2 గంటల్లో 14సార్లు భూమి కంపించింది. వీటిల్లో అత్యధిక తీవ్రత 3.0గా ఉంది. జిన్హావ్​లో మాత్రం.. 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

చైనాలో భూకంపం.. అక్కడి రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపించింది. మొత్తం 27 రైళ్లు రద్దు అవ్వడం లేదా ఆలస్యంగా నడుస్తుండటం జరిగిందని జిన్జియాంగ్​ రైల్వే విభాగం వెల్లడించింది.

Eathquake in China : భూకంపం ప్రభావిత ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్​ సర్వీసెస్​ని వెంటనే యాక్టివేట్​ చేసినట్టు వివరించారు. స్థానికంగా ఉన్న సహాయ సిబ్బందిని ఘటనాస్థలానికి పంపించినట్టు స్పష్టం చేశారు.

కాగా.. చైనాలో భూకంపం ధాటికి ఎవరైనా మరణించారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. దానిపై చైనా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

చైనాలో గడిచిన 24 గంటల్లో అనేకమార్లు భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రకంపనలతో జిన్జియాంగ్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సరిహద్దు దేశం కజగిస్థాన్​లోని అతిపెద్ద నగరమైన ఆల్మటీలో 6.7 తీవ్రతో భూమి కంపించింది. తీవ్రమైన చలిలోనూ ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

Earthquake in Delhi : గత కొన్ని నెలలుగా ప్రకృతి విప్పత్తులు చైనా ప్రజలను ఒక్కొక్కటిగా భయపెడుతూనే ఉన్నాయి. ఓసారి వర్షం అధికంగా కురుస్తే, ఇంకోసారి మంచు తీవ్రత పెరుగుతోంది. ఇంకోసారి భూకంపం భయపెడుతుంది. మరోసారి కొండచరియలు విరిగిపడే ఘటనలు నమోదయ్యాయి.

చైనాలో భూకంపం ధాటికి దిల్లీలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇది జరగడం కొత్తేమీ కాదు. జనవరి 11న అఫ్గానిస్థాన్​లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవిస్తే..ఆ ప్రకంపనలు దిల్లీని తాకాయి. నేపాల్​లో భూకంపం సంభవించినా.. ఆ ప్రకంపనలు దిల్లీ వరకు కనిపిస్తాయి. ప్రజలు భయంతో ఉలిక్కిపడుతున్నారు.

తదుపరి వ్యాసం