తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cat 2024 Notification : త్వరలో క్యాట్​ నోటిఫికేషన్​- ఇలా అప్లై చేసుకోండి..

CAT 2024 notification : త్వరలో క్యాట్​ నోటిఫికేషన్​- ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

15 July 2024, 7:20 IST

google News
    • CAT 2024 : క్యాట్ 2024 నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్​ విడుదలవ్వొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఐఐఎం క్యాట్ కోసం ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
క్యాట్​ నోటిఫికేషన్​ ఎప్పుడు వస్తుంది?
క్యాట్​ నోటిఫికేషన్​ ఎప్పుడు వస్తుంది?

క్యాట్​ నోటిఫికేషన్​ ఎప్పుడు వస్తుంది?

క్యాట్ 2024 నోటిఫికేషన్​ని త్వరలో విడుదల చేయనుంది ఐఐఎం (ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్). ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్​సైట్​లో కామన్ అడ్మిషన్ టెస్ట్ అధికారిక నోటిఫికేషన్​ని అభ్యర్థులు చూసుకోవచ్చు.

గత ట్రెండ్స్ ప్రకారం వెళితే క్యాట్ 2024 నోటిఫికేషన్ జూలైలో విడుదల వుతుంది. 2024 ఆగస్టులో రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్​లో రిజిస్ట్రేషన్ ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డులను ఐఐఎం విడుదల చేస్తుంది. నవంబరులో పరీక్ష నిర్వహించి 2025 జనవరిలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన సీజపీఏ (షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ ట్రైబ్​ (ఎస్టీ), వికలాంగుల (పీడబ్ల్యుడీ) కేటగిరీలకు చెందిన అభ్యర్థుల విషయంలో 45%) పొందలి. అయితే క్యాట్ 2024 అధికారిక బ్రోచర్ విడుదలైనప్పుడు పూర్తి అర్హత వివరాలను తెలుసుకోవచ్చు.

క్యాట్ 2024: ఎలా అప్లై చేసుకోవాలి..

ఆన్​లైన్​ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

  • స్టెప్​ 1:- ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • స్టెప్​ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉండే క్యాట్ 2024 రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3:- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • స్టెప్​ 4:- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • స్టెప్​ 5:- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • స్టెప్​ 6:- సబ్మిట్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • స్టెప్​ 7:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1200, ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ.2400. దరఖాస్తు ఫీజును ఆన్​లైన్ ద్వారా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు.

ఐఐఎంలతో పాటు, క్యాట్ స్కోర్లను లిస్టెడ్​ నాన్ ఐఐఎం సభ్య సంస్థలు ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. దీనికి సంబంధించిన జాబితా విడుదల చేసినప్పుడు సమాచార బులెటిన్​లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

గేట్​ 2025 పరీక్ష తేదీలు..

ఐఐటీ రూర్కీ 2025 ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ గేట్​ 2025 నిర్వహించనుంది. గేట్ 2025 పరీక్షను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. గేట్ 2025 దరఖాస్తు ప్రక్రియ 2024 ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిపింది.

గేట్ 2025ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​గా నిర్వహిస్తారు, మొత్తం 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్​లో మాత్రమే ఉంటుంది. గేట్ 2025లో అభ్యర్థులు సాధించిన స్కోర్లు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం