MBA in IIM Lucknow: జాబ్ చేస్తూ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?.. మీ కోసమే ఈ ఆఫర్-iim lucknow offers 2 year mba for working professionals ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mba In Iim Lucknow: జాబ్ చేస్తూ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?.. మీ కోసమే ఈ ఆఫర్

MBA in IIM Lucknow: జాబ్ చేస్తూ ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?.. మీ కోసమే ఈ ఆఫర్

HT Telugu Desk HT Telugu
Nov 19, 2023 12:01 PM IST

MBA in IIM Lucknow: జాబ్ చేస్తూ, ప్రొఫెషనల్ గ్రోత్ కోసమో, ఆసక్తితోనో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా?.. ప్రీమియం మేనేజ్మెంట్ కాలేజీలో మీకు ఆ అవకాశం అందుబాటులోకి వచ్చింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐఎం లక్నోలో 2 సంవత్సరాల ఎంబీఏ ప్రొగ్రామ్ ను ప్రారంభించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT File Photo)

MBA in IIM Lucknow: వర్కింగ్ ప్రొషెషనల్స్, ఎగ్జిక్యూటివ్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రొఫెషనల్స్ కోసం ఐఐఎం లక్నో రెండు సంవత్సరాల ఎంబీఏ ప్రొగ్రామ్ ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

నోయిడా క్యాంపస్ లో..

ఈ కోర్సును ఐఐఎం లక్నో నోయిడా క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ PGPWE కోర్సును ప్రస్తుత జాబ్ వదిలేయాల్సిన అవసరం లేకుండానే పూర్తి చేయవచ్చు. కోర్సు అనంతరం ప్రొఫెషనల్ గ్రోత్ కు మంచి అవకాశాలుంటాయి. యూరోప్ లోని ప్రముఖ మేనేజ్మెంట్ కాలేజీలతో భాగస్వామ్యంతో ఈ కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు ప్రత్యేకంగా రెండు వారాల ఇంటర్నేషనల్ ఇమర్షన్ మోడ్యూల్ ఉంటుంది. దీనివల్ల వివిధ వ్యాపారాల్లో అంతర్జాతీయ ధోరణులపై అవగాహన పెంచుకోవచ్చు’’ అని ఈ కోర్సు వివరాలను IIM లక్నోలోని అడ్మిషన్స్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ ఎస్ వెంకటరమణయ్య వివరించారు.

కోర్సు ప్రొగ్రామ్

ఈ 2 సంవత్సరాల ఎంబీఏ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరంలో నాలుగు, రెండవ సంవత్సరంలో మూడు టర్మ్‌లు ఉంటాయి. ఈ కోర్సు కరిక్యులమ్ లో మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, డిజైనింగ్ వర్క్ ఆర్గనైజేషన్ వంటి సాధారణ మాడ్యూల్స్‌తో పాటు అనేక రకాల ఇతర ఆప్షన్స్ ఉంటాయి.

Eligibility Criteria: అర్హత

ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి. అవి..

  • అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • కనీసం మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ జాబ్ ఎక్స్ పీరియెన్స్ ఉండాలి.
  • GMAT/GRE స్కోర్, CAT స్కోర్ లేదా GATE స్కోర్ ఉండాలి.
  • లేదా ప్రత్యామ్నాయంగా, అభ్యర్థులు నోయిడా క్యాంపస్‌లో డిసెంబర్ 17, 2023న జరిగే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
  • షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత, అభ్యర్థుల పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Whats_app_banner