Cargo ship hijacked : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్- రంగంలోకి ఇండియన్ నేవీ!
05 January 2024, 13:08 IST
- Cargo ship hijacked : సోమాలియా తీరానికి సమీపంలో ఎంవీ లీలా నార్ఫోక్ నౌక హైజాక్‌కు గురైంది. ఇందులో 15మంది భారతీయులు ఉన్నారు.
15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్- రంగంలోకి ఇండియన్ నేవీ!
MV LILA NORFOLK hijacked : సోమాలియా తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌక.. గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం.హైజాక్ అయిన నౌకలోని వారిని రక్షించేందుకు భారత నౌకాదళం ప్రయత్నిస్తోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
అసలేం జరిగింది..?
హైజాక్‌కు గురైన నౌక కదలికలపై నిఘా ఉంచేందుకు భారత నౌకాదళం.. విమానాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. నౌకతో కమ్యూనికేషన్‌ని విజయంవంతంగా ఏర్పాటు చేసినట్టు, నౌకలోని సిబ్బంది పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించరు.
యూకేఎంటీవో (యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్) పోర్టల్‌లో.. 2024 జనవరి 4 సాయంత్రాన సుమారు 5, 6 మంది గుర్తుతెలియని సాయుధ సిబ్బంది నౌకను హైజాక్ చేసినట్టు సమాచారం అందినట్టు భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
MV LILA NORFOLK crew : హైజాక్‌కు గురైన నౌకను రక్షించేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను సంబంధిత ప్రాంతానికి పంపించింది. ఇంకొన్ని గంటల్లో ఐఎన్ఎస్ చెన్నైకి హజాక్కు గురైన నౌకకు మధ్య లింక్ ఏర్పడుతుందని సమాచారం.
నావికాదళ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. నౌక కదలికలను పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలోని ఇతర ఏజెన్సీలు/ ఎంఎన్ఎఫ్ సమన్వయంతో మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
ఈ హాజాక్కు ఎవరు పాల్పడ్డారు? ఎంత మంది నౌకలో ఉన్నారు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న వివరాలు తెలియరాలేదు.
పెరుగుతున్న సముద్రపు దొంగల దాడి..
Cargo ship hijacked : అరేబియా సముద్రంలో మాల్టీస్ జెండా కలిగిన వాణిజ్య నౌకను గుర్తుతెలియని దుండగులు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే హైజాకింగ్ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. నాడు.. హైజాక్‌కు గురైన నౌకలోని 18మందిలో ఒకరిని ఇండియన్ నేవీ రక్షించింది. ఆ బల్గేరియన్ వాసికి మెడికల్ కేర్ని అందించింది. అనంతరం అతడిని ఐఎన్ఎస్ కొచ్చిలో తరలించింది.
2008 - 2013 మధ్య ఆ ప్రాంతంలో పైరేట్ల దాడులు గరిష్ట స్థాయిలో ఉండేవి. కానీ భారత నావికాదళంతో సహా మల్టీ నేషనల్ మేరిటైమ్ టాస్క్ ఫోర్స్ బృందం సమిష్టి కృషి కారణంగా ఆ తరువాత దాడులు తగ్గిపోయాయి. కానీ చూస్తుంటే, దాడులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది!