తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జా కేసు

బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం, భూకబ్జా కేసు

HT Telugu Desk HT Telugu

23 December 2024, 9:33 IST

google News
  • ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ శాక్య, ఆయన సోదరుడు సతేంద్ర శాక్యతో పాటు 16 మందిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. లైంగిక వేధింపులు, భూకబ్జాలు, ఇతర నేరాలు ఉన్నాయి.

కోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం కేసు
కోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం కేసు (HT_PRINT)

కోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే సహా 16 మందిపై సామూహిక అత్యాచారం కేసు

బదౌన్(ఉత్తరప్రదేశ్): బీజేపీ ఎమ్మెల్యే హరీష్ శాక్య, ఆయన సోదరుడు సతేంద్ర శాక్య సహా 16 మందిపై ఉత్తరప్రదేశ్లోని బదౌన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. లైంగిక వేధింపులు, భూకబ్జాలు, ఇతర నేరాలు ఉన్నాయి.

ఉఝని కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి కోట్ల విలువైన 25 బిగాల భూమి ఉంది. బిల్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు అయిన ఎమ్మెల్యే ఈ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకున్నారు. అందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో బెదిరింపులు, వేధింపులు ఎదురయ్యాయని వాపోయారు.

కిడ్నాప్ చేసి చిత్రహింసలు

తన భర్తను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని, అతనిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టారని బాధితురాలు ఆరోపించింది. సమస్యను పరిష్కరిస్తాననే నెపంతో ఆమెను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, ఇతరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. భూమికి సంబంధించిన మూడు ఒప్పందాలపై సంతకాలు చేయాలని ఆమెను బలవంతం చేశారని ఆరోపించింది.

బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఈనేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆత్యహత్య చేసుకున్న సమీప బంధువు

బాధితురాలు తన ఫిర్యాదులో బెదిరింపులు, వేధింపుల తీరుతెన్నులను వివరించారు. తన సమీప బంధువైన రోహిత్‌ను కిడ్నాప్ చేసి కొట్టారని, తమ భూమిని విక్రయించాలని తన కుటుంబాన్ని బలవంతం చేశారని ఆమె ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన రోహిత్ 2022 ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నాడని వివరించింది. తమకు న్యాయం చేయాలని తాము చేసిన విన్నపాలను అధికారులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం వాపోయింది.

నిందితులు తమ పంటలను నాశనం చేశారని, ఒత్తిడి ఎత్తుగడలు ప్రయోగించి తక్కువ ధరకు భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే హరీష్ శాక్య ఖండించారు. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని, పోలీసులు, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని బీజేపీ నేత పేర్కొన్నారు.

కాగా, ఈ కేసు తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలతో సహా సమగ్ర విచారణ జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. (ఏఎన్ఐ)

టాపిక్

తదుపరి వ్యాసం