తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Lovers : ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్​ను కట్​ చేసిన యువతి!

Bihar lovers : ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్​ను కట్​ చేసిన యువతి!

Sharath Chitturi HT Telugu

23 July 2023, 17:27 IST

google News
    • Bihar lovers : బిహార్​లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ఓ యువతి, తన ప్రియుడిని కలిసేందుకు.. ఏకంగా గ్రామం మొత్తానికే విద్యుత్​ సరఫరాను కట్​ చేసేది. హైలైట్​ ఏంటంటే.. ఈ విషయం బయటపడిన కొన్ని రోజులకే, ప్రేమ జంటకు పెళ్లి జరిగిపోయింది!
ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్​ను కట్​ చేసిన యువతి!
ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్​ను కట్​ చేసిన యువతి! (Pixabay/ representative)

ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్​ను కట్​ చేసిన యువతి!

Bihar lovers : ప్రేమలో ఉంటే ఆ ఫీల్​ చాలా బాగుంటుంది! కానీ ఇంట్లో వాళ్లకి, చుట్టుపక్కన వారికి తెలియకుండా కలవడం చాలా కష్టమైన విషయమే. ఇందుకోసం ప్రేమ జంట చాలా ప్లాన్స్​ వేస్తుంది. బిహార్​లోని ఓ యువతికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె మాత్రం చాలా పెద్ద స్కెచ్ఛే వేసింది. ప్రియుడిని కలిసేందుకు ఆమె చేసిన ఓ పని గురించి తెలుసుకున్న వారందరు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమికుడిని కలిసేందుకు.. సొంత గ్రామంలో విద్యుత్​ను కట్​ చేసేసేది ఆ యువతి!

ఇదీ జరిగింది..

బిహార్​ పశ్చిమ్​ చంపారన్​లోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. యువతి పేరు ప్రీతి, యువకుడి పేరు రాజ్​కుమార్​. ఈ ప్రేమ జంట.. పక్కపక్కన గ్రామాల్లో నివాసముంటుంది. కాగా.. యువతి ఉంటున్న గ్రామంలో తరచూ విద్యుత్​ సరఫరా నిలిచిపోయేది. ఆ సమయాల్లో దొంగతనాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Bihar latest news : పవర్​ కట్స్​తో విసుగెత్తిపోయిన గ్రామస్థులు.. విద్యుత్​శాఖకు అనేకమార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఓ రోజు వారికి అనుమానం వచ్చింది. "అసలు మన గ్రామంలోనే ఇన్నిసార్లు కరెంట్​ ఎందుకు పోతోంది?" అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడే ఆ ప్రేమ జంట వ్యవహారం బయటపడింది.

ఓ రోజు రాత్రి.. ఇలాగే కరెంట్​ పోయింది. గ్రామస్థులు గ్రామంలో తిరగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యువతి, ఆమె ప్రేమికుడు కలిసి ఉండటాన్ని చూశారు. వారిద్దరిని పట్టుకుని ప్రశ్నించారు. ప్రియుడిని కలిసేందుకు తానే విద్యుత్​ను కట్​ చేస్తున్నట్టు ఆ యువతి చెప్పిన మాటలు విని షాక్​ అయ్యారు.

ఇదీ చూడండి:- Relationship Tips। మీరు ప్రేమలో ఉన్నారా? మీది నిజమైన ప్రేమ అయితే ఇలాంటివి సహించకండి!

కొంతసేపటికి.. రాజ్​కుమార్​పై గ్రామస్థులు దాడి చేశారు. అతడిని కర్రలతో కొట్టారు. ఆ యువతి మాత్రం అతడిని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరికి, వారి నుంచి అతడిని విడిపించుకుని తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

కట్​ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు, తన గ్యాంగ్​తో ఆ గ్రామంపై దాడి చేశాడు. తనని కొట్టిన వారిని తిరిగి కొట్టి రివేంజ్​ తీర్చుకున్నాడు. ఈ ఘటనతో వారం రోజుల పాటు రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణ కొనసాగింది.

పెళ్లి చేసేశారు..!

Girl cuts power supply to meet lover : చివరికి.. రెండు గ్రామాల ప్రజలు, పెద్దలు ఒక చోట సమావేశమయ్యారు. ఒకరిని ఒకరు మర్చిపోవాలని ప్రేమ జంటకు చెప్పారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రేమ జంటకు పెళ్లి చేయాలని ఫిక్స్​ అయ్యారు. కట్​ చేస్తే.. స్థానిక గుడిలో రాజ్​కుమార్​- ప్రీతి పెళ్లి జరిగింది.

తదుపరి వ్యాసం