తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Water Crisis : ప్రజలకు అలర్ట్.. కార్లు కడగడంపై ప్రభుత్వం నిషేధం!

Bengaluru water crisis : ప్రజలకు అలర్ట్.. కార్లు కడగడంపై ప్రభుత్వం నిషేధం!

Sharath Chitturi HT Telugu

08 March 2024, 12:15 IST

    • Bengaluru water crisis news : బెంగళూరులో నీటి సంక్షోభం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనాలను మంచి నీటితో కడగడం, గార్డెన్ల కోసం డ్రింకింగ్​ వాటర్​ వాడటాన్ని నిషేధించింది.
కర్ణాటకలో ఇక.. మంచి నీటితో కార్లు కడగకూడదు!
కర్ణాటకలో ఇక.. మంచి నీటితో కార్లు కడగకూడదు!

కర్ణాటకలో ఇక.. మంచి నీటితో కార్లు కడగకూడదు!

Bengaluru water crisis areas : బెంగళూరులో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్లను కడగడం, గార్డెనింగ్ నిర్వహణతో సహా వివిధ అవసరాల కోసం తాగునీటి వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధించాలని కర్ణాటక వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (కేడబ్ల్యూఎస్ఎస్బీ) నిర్ణయించింది. వాటర్​ ట్యాంకుల ధరలను ఫిక్స్​ చేసిన ఒక్క రోజు వ్యవధిలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

బెంగళూరులో నీటి సంక్షోభం..

వేసవి కాలం ఇంకా ప్రారంభం దశలోనే ఉన్నప్పటికీ.. బెంగళూరు నగరం తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతోంది. ట్యాంకర్లతో కూడా పని జరగడం లేదు! ఫలితంగా నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలో 3 వేలకు పైగా బోరుబావులు ఎండిపోయాయని, గత వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భారీ లోటు ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

Bengaluru water scarcity news : టెక్ హబ్​లోని అపార్ట్​మెంట్ కాంప్లెక్స్​లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా నీటి వినియోగానికి ఆంక్షలు విధిస్తూ నిబంధనలు విధించడం ప్రారంభించాయి. నీళ్లు లేవని తమ సొసైటీలు నోటీసులు పంపుతున్నాయని కొందరు నివాసితులు సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నారు.

రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కేంద్రాన్ని కరువు సహాయాన్ని కోరుతోంది. రాష్ట్రంలో కూడా ఎప్పటికప్పుడు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. నీటికి సంబంధించిన ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, నీటిపారుదలపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

నీటి చుట్టూ రాజకీయాలు..

Bengaluru water shortage : మరోవైపు.. బెంగళూరులో నీటి సంక్షోభంపై రాజకీయ దూమారం చెలరేగింది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష బీజేపీ మండిపడుతోంది. బెంగళూరులో తాగునీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే విధానసౌధ ముందు ఆందోళనలు చేపడతామని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్​ నేతలు తిప్పికొట్టే పనిలో పడ్డారు.

నీటి సంక్షోభానికి అసలు కారణం ఏంటి..?

Bengaluru water crisis reason : బెంగళూరులో నీటి కొరత ప్రభావం అనేక ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మాటిమాటికి నీటి సప్లై ఆగిపోతోందని తెలుస్తోంది. జనవరి రెండో వారం నుంచే పరిస్థితి బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొంది. ఈ పరిణామాలతో ప్రజలు.. ప్రైవేట్​ ట్యాంకర్లను మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇదే సరైన సమయం అని భావిస్తున్న ప్రైవేట్​ ట్యాంకర్​ సంస్థలు.. ధరలను అమాంతం పెంచేశాయి. తాజాగా.. ప్రభుత్వ ఆదేశాలతో రేట్లకు చెక్​ పడింది.

గతేడాది.. నగరంలో వర్షాలు సరిగ్గా పడలేదు. బోర్​వెల్స్​ ఎండిపోయాయి. గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ పడిపోయాయి. మౌలికవసతులు సరిగ్గా లేవు. వీటికి తోడు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న మంచి నీటి ట్యాంకర్​ మాఫియా కూడా ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ.. బెంగళూరులో మంచి నీటి సంక్షోభానికి పలు కారణాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం