తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Water Diet For Weight Loss : వాటర్ ఫాస్టింగ్‌తో మూడు రోజుల్లో 5.7 కిలోల బరువు తగ్గొచ్చు

Water Diet For Weight Loss : వాటర్ ఫాస్టింగ్‌తో మూడు రోజుల్లో 5.7 కిలోల బరువు తగ్గొచ్చు

Anand Sai HT Telugu

04 March 2024, 17:00 IST

    • Water Diet For Weight Loss : బరువు తగ్గేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా వాటర్ ఫాస్టింగ్ ఉన్నారా? దీనితో చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.
వాటర్ ఫాస్టింగ్ లాభాలు
వాటర్ ఫాస్టింగ్ లాభాలు (Unsplash)

వాటర్ ఫాస్టింగ్ లాభాలు

బరువు పెరగడం అనేది ఈ కాలంలో ఎక్కువైపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనేక కారణాల వల్ల బరువు పెరుగుతారు. సరైన జీవనశైలి లేకపోవడం, మానసిక ఒత్తిడి, ప్రసవం తర్వాత స్త్రీలు, కొన్ని మందుల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల బరువు పెరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

అధిక బరువును ఎలా తగ్గించుకోవాలనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే వాటర్ ఫాస్టింగ్ అనేది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

తర్వాత బరువు పెరగదు

బరువు తగ్గడానికి వాటర్ డైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా పరీక్షించారు. ఈ అధ్యయనంలో 12 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. శరీరంలో జరుగుతున్న మార్పులను రోజూ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తెలిసింది ఏంటంటే.. నీటి ఉపవాసం తర్వాత ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు 5.7 కిలోల బరువు తగ్గారు. 3 రోజులు అన్నం తిన్న తర్వాత కూడా కోల్పోయిన బరువు పెరగలేదు.

వాటర్ మాత్రమే తీసుకోవాలి

ఈ అధ్యయనాన్ని హెల్త్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ (క్లాడియా లాంగెన్‌బర్గ్) డైరెక్టర్ క్వీన్ మేరీ నిర్వహించారు. ఉపవాసం సరైన పద్ధతిలో చేస్తే బరువు ఎఫెక్టివ్‌గా తగ్గుతుందని, ఆరోగ్యంపై చెడు ప్రభావం పడదని మేరీ చెప్పారు. ఈ వాటర్ ఫాస్ట్ అంటే నిర్ణీత సమయం వరకు నీరు తప్ప మరేమీ తీసుకోకుండా ఉండటమే. ఈ నీటి ఉపవాసం 24 గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇలా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని కండరాలలో పేరుకుపోయిన కొవ్వు కరిగి, కొవ్వు శక్తిగా మారుతుంది. దీంతో బరువు త్వరగా తగ్గుతుంది.

వాటర్ ఫాస్టింగ్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తే క్యాన్సర్‌తో పాటు అనేక వ్యాధులను అరికట్టవచ్చు. ఈ వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నిపుణులను సంప్రదించాలి. ఈ కాలంలో మీరు వ్యాయామం చేయగలరా? ఏదైనా శారీరక శ్రమ చేయగలరా? అనే దాని గురించి కూడా చూసుకోవాలి. ఎందుకంటే నీటితో మాత్రమే ఉపవాసం చేయడం వల్ల మీరు చాలా త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.

వాటర్ ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు

తక్కువ బరువు ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఫాస్టింగ్ చేయెుద్దు. మైగ్రేన్ ఉన్నవారు, ఇటీవల రక్తదానం చేసిన వ్యక్తులు కూడా నీటి ఉపవాసం చేయవద్దు. మీరు 24 గంటలు ఉపవాసం ఉంటే సమస్య లేదు, మీరు అంతకు మించి ఉపవాసం ప్లాన్ చేస్తే దాని గురించి వైద్యుడికి చెప్పాలి. మీకు ఏదైనా అసౌకర్యం ఉంటే ఉపవాసం చేయకండి.

బరువు తగ్గించే క్రమంలో కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ప్రాణాలమీదకు వచ్చేలా ఉంటే మాత్రం ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిది. నిపుణుల సలహా మేరకు ఏదైనా ప్రయత్నించాలి. కొత్త విషయం ఫాలో అయ్యే సమయంలో కచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి.

తదుపరి వ్యాసం