Weight Loss In Sleeping : నిద్రలో కూడా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేస్తే మంచిది-weight loss in sleeping how to burn fat while sleeping ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss In Sleeping : నిద్రలో కూడా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేస్తే మంచిది

Weight Loss In Sleeping : నిద్రలో కూడా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేస్తే మంచిది

Anand Sai HT Telugu
Mar 03, 2024 06:10 PM IST

Weight Loss In Sleeping : బరువు తగ్గేందుకు చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడతారు. అయితే నిద్రపోయాక కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయవచ్చు.

నిద్రలో బరువు తగ్గేందుకు చిట్కాలు
నిద్రలో బరువు తగ్గేందుకు చిట్కాలు (Unsplash)

మీ ఎత్తుకు తగిన బరువులో లేరా? ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? చాలా బద్ధకంగా ఉన్నారా? సులువైన మార్గంలో బరువు తగ్గాలని చూస్తున్నారా? మీరు నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చని మీకు తెలుసా? నమ్మట్లేదా? అయితే ఈ కింది చిట్కాలు పాటించండి.

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును నిజంగా కరిగించుకోవచ్చు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు క్రమం తప్పకుండా పాటించాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తినడం కూడా అవసరం. మీరు అలా చేయాలనుకుంటే.. కింద చెప్పిన వాటిని తప్పకుండా అనుసరించండి. ఇది కచ్చితంగా శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది.

భోజనం ఇలా ప్లాన్ చేయండి

రోజంతా ప్రతి 2 గంటలకు తక్కువ భోజనం తినండి. శరీరం జీవక్రియ పనితీరుకు శక్తి చాలా అవసరం. అటువంటి శక్తిని ఆహారం ద్వారా మాత్రమే పొందవచ్చు. మీరు తీపి, జంక్ ఫుడ్ కోరుకోవచ్చు. కానీ మీరు వారానికి ఒకసారి చీజ్, వెన్న, చాక్లెట్‌లను తక్కువ తినండి. కావాలనుకుంటే వీటికి మంచి ప్రత్యామ్నాయాలుగా ఖర్జూరాలు లేదా డార్క్ చాక్లెట్ తినవచ్చు.

నిద్రించే సమయంలో శరీరంలోని కొవ్వు కరగాలంటే రాత్రిపూట కొన్ని ఆహారాలు తినాలి. శరీరంలో మెటబాలిజాన్ని పెంచే, కొవ్వు పదార్థాలను కరిగించే ఆహారాలను ఎంచుకుని తినడం చాలా ముఖ్యం. మీకు ఏ ఆహారాలు సరైనవో తెలుసుకోండి.

సిట్రస్ పండ్లు తినాలి

సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ వంటి కొవ్వును కరిగించే పోషకాలు ఉంటాయి. కొవ్వును కరిగించడంలో విటమిన్ సి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ పోషకం కొవ్వులను వేగంగా కరిగించి శరీరంలోని చెడు కొవ్వులను తొలగిస్తుంది. రాత్రిపూట ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఈ పోషకాలు ద్రాక్షపండు, జామ, నిమ్మ, బొప్పాయి, టమోటాలలో పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను రాత్రిపూట జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

చిక్కుళ్లు తినండి

చిక్కుళ్ళు మొక్క ఆధారిత ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఈ ప్రోటీన్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. పప్పులను రాత్రిపూట వండుకుని తింటే శరీరంలోని అదనపు కొవ్వులు, కేలరీలు కరిగిపోయి శరీర బరువు వేగంగా తగ్గుతుంది.

రాత్రి పాలు తాగండి

పాలు, పాల ఉత్పత్తులు బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. ఇందులోని కాల్షియం కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇందులో ఉండే మినరల్ కంటెంట్ శరీరంలోని మెటబాలిజాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే పాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. పాలను నిత్యం రాత్రి పడుకునే ముందు తాగితే శరీరంలోని జీవక్రియలు ఉత్తేజితమై శరీర బరువు త్వరగా తగ్గుతుంది.

తృణధాన్యాల్లోని పోషకాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇది ప్రధానంగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీరం జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఫలితంగా అదనపు కొవ్వులు, కేలరీలు కరిగిపోతాయి. రాత్రిపూట గోధుమలు, బార్లీ, బ్రౌన్ రైస్, మిల్లెట్ మొదలైన తృణధాన్యాలు తినండి.

రాత్రిపూట స్పైసీ ఫుడ్స్ తింటే శరీరంలోని మెటబాలిజం ప్రేరేపిస్తుంది. రాత్రిపూట టేస్టీ, స్పైసీ ఫుడ్ తింటే ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఆల్కలీన్ ఫుడ్స్ జీవక్రియను పెంచి కొవ్వును కరిగించి బరువు తగ్గుతాయి.

మీరు రాత్రి పడుకునే 2 గంటల ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే, ఇందులోని సమృద్ధిగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్ కంటెంట్ శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది, కొవ్వులను కరిగించే పనిని పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

8 గంటల నిద్ర అవసరం

బరువు తగ్గడంలో నిద్ర కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఎంత నాణ్యమైన నిద్ర పొందాడనేది కూడా ముఖ్యం. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తమ మనస్సును రిలాక్స్‌గా ఉంచుకుని మంచి నిద్రను పొందడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు.

సాయంత్రం వ్యాయామం చేయండి

శరీరంలోని హార్మోన్లు సక్రమంగా పనిచేయడానికి, కొవ్వులు సక్రమంగా కరిగిపోవడానికి వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయాలి. వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. శరీరంలో ఎక్కువ కేలరీలు, కొవ్వు కరిగిపోతుంది. ఒక వ్యక్తి బరువులు ఎత్తిన ఒక గంట తర్వాత కూడా శరీరం కొవ్వును కాల్చడం కొనసాగిస్తుంది. సాయంత్రం పూట వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

Whats_app_banner